India Loan Amount: ఇండియా అప్పు రూ.135లక్షల కోట్లు

భారతదేశ అప్పు 70ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2వేల 565.40కోట్లు ఉండగా 2021-22 నాటికి అది రూ.కోటి 35లక్షల 86వేల 975.52కోట్లకు చేరింది.

India Loan Amount: ఇండియా అప్పు రూ.135లక్షల కోట్లు

India Loan

Updated On : December 13, 2021 / 7:34 AM IST

India Loan Amount: భారతదేశ అప్పు 70ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2వేల 565.40కోట్లు ఉండగా 2021-22 నాటికి అది రూ.కోటి 35లక్షల 86వేల 975.52కోట్లకు చేరింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62లక్షల 42వేల 220.92కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.కోటి 35లక్షల 86వేల 975.52కోట్లకు చేరింది. అంటే ఏడేళ్లలో 117శాతం పెరిగింది. 64ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్లు మేర ఉండగా, ఏడేళ్లలోనే కొత్తగా రూ.73లక్షల 44వేల 754కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడైంది.

1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2వేల 22.30కోట్లు, విదేశీ రుణం రూ.32.03 కోట్ల మేర ఉండగా, 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.కోటి 13లక్షల 57వేల 415కోట్లు, విదేశీ రుణం రూ.4కోట్ల 27లక్షల 925.24కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువు కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు.

Australia : గ్రౌండ్‌‌లో ప్రేయసికి ప్రపోజల్ చేసిన ఆసీస్ మహిళ

ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.లక్షా 62వేల 827.90కోట్లకు చేరింది.