ఇండియా ముస్లింలు చాలా అదృష్టవంతులు..వారికి స్వేచ్ఛ ఉంది

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 03:33 AM IST
ఇండియా ముస్లింలు చాలా అదృష్టవంతులు..వారికి స్వేచ్ఛ ఉంది

Updated On : September 23, 2019 / 3:33 AM IST

భారతీయ ముస్లింలు చాలా అదృష్టవంతులని..వారు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారని  ప్రముఖ జర్నలిస్ట్ పద్మభూషణ్‌ సర్‌ విలియం మార్క్‌ టుల్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ప్రపంచ దేశాలన్నింటిలోను భారత్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతోంది. ప్రజల స్వేచ్ఛ విషయంలో వారి మనోభావాల విషయంలో భారత్ ది ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తోంది. ఇదే విషయాన్ని తన మాటల్లో వ్యక్తపరిచారు విలియం మార్క్. 

ప్రపంచంలోనే  ఇస్లామిక్‌ దేశాల్లోని ముస్లింల కంటే భారతీయ ముస్లింలు చాలా అదృష్టవంతులనీ..భారత్ తో ఉన్నా…ప్రపంచంలోనే ఏ ఇస్లామిక్ దేశపు ఇస్లాం సంప్రదాయాలైనా అనుసరిస్తూ..భగవంతుడిని ఆరాధించుకొనే స్వేచ్ఛ వారికి ఉందన్నారు. అన్ని మతాలను ఆలవాలమైన భారత్ చాలా చాలా ప్రత్యేకమైనదనీ మార్క్‌ టుల్లీ అన్నారు. ‘ది ఇక్వెటార్‌ లైన్‌’ ‘హోం అండ్‌ ది వరల్డ్‌’ పేరుతో విడుదలైన సంచిక (బులిటెన్)కు రాసిన ఓ ఆర్టికల్ లో విలియం మార్క్ తన అభిప్రాయాలు  కుండబద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేశారు.  
 
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో తన ఇంటికి సమీపంలోని తబ్లిఘి జమాత్‌ వర్గం మెయిన్ ఆఫీసులకు కఠినమైన, సంప్రదాయవాదులు ఉన్నారనీ..అక్కడికి దగ్గరలోనే ఉన్న నిజాముద్దీన్‌ ఆలియా సమాధి వద్ద ప్రజలు ప్రార్థన..కవ్వాలీ పాడే సూఫీ సంప్రదాయం కూడా ఉందని ఆయన తెలిపారు. సహనమే భారత్‌ ఆత్మ బలంగా విశ్వాసమని.. భారత్ పలు మతాలు..కులాలు..తెగలు విభిన్న సంప్రదాలు..సంస్కృతులతో కలిసిమెలిసి జీవించేలా సామరస్య వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు.

బీబీసీలో 30 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేసిన మార్క్‌ టుల్లీ.. ఇండో-పాక్‌ సంఘర్షణ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌, రాజీవ్‌గాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత తదితర అంశాలను..పరిణామాలపై పలు ఆర్టికల్స్ రాశారు.   బీబీసీ చీఫ్ ఆఫ్ బ్యూరో గా  20 సంవత్సరాలు పనిచేశారు. విలియం తండ్రి బ్రిటీష్ వ్యాపారవేత్త. ఓరియంటల్ క్లబ్ సభ్యుడు కూడా. రచయితగా కూడా పేరు పొందిన విలయం రాసిన పుస్తకాలకు పలు అవార్డులు అందుకున్నారు. రాజకీయ..సామాజిక అంశాలపై ఎంతో అవగాహన ఉన్న సర్‌ విలియం మార్క్‌ టుల్లీ భారతీయ ముస్లింలు చాలా అదృష్టవంతులు అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంచేశారు.