India Covid : 9,19,996 కరోనా టెస్టులు…10 వేల కేసులు
24 గంటల్లో 10,853 కరోనా పాజిటివ్ కేసులు నమాదయ్యాయని, 526 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Corona
India Corona Cases : భారత్ లో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా…24 గంటల్లో 10,853 కరోనా పాజిటివ్ కేసులు నమాదయ్యాయని, 526 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,44,845 యాక్టీవ్ కేసులున్నాయని, దేశంలో ఇప్పటివరకు 3,43,55,536 కేసులు రికార్డయ్యాయి. 4,60,791 మంది వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. దేశంలో 98.24 శాతంగా కరోన రికవరీ రేటు ఉందని, శనివారం కరోనా నుంచి 12,432 మంది కోలుకున్నారని వెల్లడించింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,49,900గా ఉంది. దేశంలో మార్చి 2020 తరువాత భారీగా రికవరీ కేసుల శాతం పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా పరీక్షలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ లో 61.48 కోట్లు కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Read More : Sierra Leone : ఘోర దుర్ఘటన 100 మంది మృతి
గడిచిన 24 గంటల్లో 9,19,996 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61,48,85,747 టెస్టులు నిర్వహించినట్లైంది. దేశవ్యాప్తంగా 3025 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు 1336 ప్రభుత్వ లాబ్స్,1689 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.