India-Pakistan: సరిహద్దు ధాటి వచ్చిన ఇద్దరు పాకిస్తానీయులను అప్పగించిన భారత్

పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులను తిరిగి ఆదేశానికి అప్పగించారు భారత అధికారులు.

India-Pakistan: సరిహద్దు ధాటి వచ్చిన ఇద్దరు పాకిస్తానీయులను అప్పగించిన భారత్

Pakis

Updated On : April 17, 2022 / 9:29 PM IST

India-Pakistan: పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులను తిరిగి ఆదేశానికి అప్పగించారు భారత అధికారులు. ఇండో – పాక్ సరిహద్దు వద్ద ఉగ్రవాదుల చొరబాటును భారత భద్రత దళాలు అడ్డుకుంటున్న సమయంలో..ఇరు దేశాలోని అమాయక ప్రజల రక్షణే ద్యేయంగా భద్రతా బలగాలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి కనువిప్పు కలిగిస్తుంది. సంబంధిత అధికారులు తెలిపిన వివరాలు మేరకు..సర్వార్ బేగ్, మొహమ్మద్ ఆసిఫ్ అనే ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులు పొరబాటున సరిహద్దు ధాటి భారత్ లోకి ప్రవేశించారు. వీరిలో సర్వార్ బేగ్ 2016లో సరిహద్దు దాటుతూ భారత సైన్యానికి చిక్కగా..మొహమ్మద్ ఆసిఫ్ ను 2018లో సరిహద్దు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని భారత ఆర్మీ ఆధీనంలోని జైలుకి తరలించారు అధికారులు.

Also Read:Amrnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 33,795 మంది నమోదు: కొనసాగుతున్న బుకింగ్

ఇద్దరు వ్యక్తుల గురించి పాకిస్తాన్ అధికారులకు సమాచారం ఇచ్చిన భారత అధికారులు..ఆమేరకు అక్కడి అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగా వీరు పాకిస్తాన్ పౌరులుగా గుర్తించారు. అనంతరం జరిగిన సమాచారం మార్పిడిలో ఇద్దరు పాకిస్తానీయులను తిరిగి స్వదేశానికి పంపించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ 17న సర్వార్ బేగ్, మొహమ్మద్ ఆసిఫ్ లను పాకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు అట్టారీ – వాఘా ప్రోటోకాల్ ఆఫీసర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. విడుదలపై సర్వార్ బేగ్, మొహమ్మద్ ఆసిఫ్ స్పందిస్తూ..తాము పొరబాటున భారత్ లోకి ప్రవేశించామని..విచారణలోనూ అదే తేలడంతో భారత అధికారులు తమను తిరిగి తమ దేశానికి పంపిస్తున్నట్లు తెలిపారు. తిరిగి స్వదేశానికి వెళ్లడంపై ఇరువురు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read:ATM Robbery: భువనేశ్వర్ టూ బంగ్లాదేశ్ వయా బెంగళూరు: ఎటిఎం చోరీ ఘటనలో విస్తుపోయే విషయాలు