Omicron Variant In India : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ బాధితులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శుక్రవారం 9 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం కరోనా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి.

Omicron Variant In India
Omicron Variant In India : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శుక్రవారం 9 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం కరోనా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 398 మంది బాధితులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా నమోదైన కేసులతో కరోనా కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది.
చదవండి : Omicron Covid Variant : మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలర్ట్.. భారత్‌లో పెరుగుతున్న కేసులు..!
ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 4,75,128 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 93,277 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 559 రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య ఇంత తక్కువ నమోదైంది. ఇప్పటివరకు 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
చదవండి : Omicron Tension : తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముంబైలో ఒకే రోజు 9 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కి చేరింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముంబైలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, వేడుకలపై ఆంక్షలు విధించారు. కాగా శుక్రవారం బయటపడిన ఒమిక్రాన్ కేసుల్లో మూడేళ్ళ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
చదవండి : Omicron In India : భారత్ లో 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజే 9 గుర్తింపు