పాక్ అతి పెద్ద మిసైల్ రేంజ్ 2700 కి.మీ.. మరి ఇండియా అతిపెద్ద మిసైల్ రేంజ్ ఎంతో తెలిస్తే.. మేరా భారత్ మహాన్ అనాల్సిందే..

భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్‌ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ.

పాక్ అతి పెద్ద మిసైల్ రేంజ్ 2700 కి.మీ.. మరి ఇండియా అతిపెద్ద మిసైల్ రేంజ్ ఎంతో తెలిస్తే.. మేరా భారత్ మహాన్ అనాల్సిందే..

Agni v

Updated On : May 7, 2025 / 8:43 PM IST

భారత్‌, పాకిస్థాన్.. ఇరు దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. రెండు దేశాలు క్షిపణి పరీక్షలను చేస్తూనే ఉన్నాయి. ఇరు దేశాల వద్ద క్షిపణులు ఉన్నప్పటికీ భారత్‌ వద్ద ఉన్న మిస్సైల్స్‌తో పోల్చితే పాకిస్థాన్‌ వద్ద ఉన్న మిస్సైల్స్‌ రేంజ్‌, టెక్నాలజీ చాలా తక్కువ.

భారత క్షిపణుల రేంజే వేరు..
భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్‌ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ. భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నేతృత్వంలో అగ్ని క్షిపణిని అభివృద్ధి చేసుకుంది. ఇవి దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు.

అగ్ని-V: ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ICBM). దీని పరిధి సుమారు 7,000–8,000 కిలోమీటర్లు. న్యూక్లియర్ వార్‌హెడ్ సామర్థ్యం (MIRV) ఉంది. లక్ష్యాలను స్వతంత్రంగా ఛేదించే రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది.

అగ్ని-VI: ఈ క్షిపణులను భారత్‌ ప్రస్తుతం అభివృద్ధి చేసుకుంటోంది. దీని రేంజ్ 10,000 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంటుంది. వీటిలో కూడా MIRV టెక్నాలజీ ఉంటుంది.

Also Read: కెవ్వుకేక.. ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే సరీ..

పాకిస్థాన్ క్షిపణి సామర్థ్యాలు
పాకిస్థాన్ ప్రధానంగా తమపై జరిగే దాడులను తిప్పికొట్టడం, భారత్‌ లక్ష్యంగా మిస్సైళ్లను సమకూర్చుకుంటోంది. అతి దూర లక్ష్యాలను పాకిస్థాన్ క్షిపణులు ఛేదించలేవు. అయితే, భారత్‌లోని అన్ని టార్గెట్‌లను మాత్రం ఛేదించే సామర్థ్యం వీటికి ఉంది.

షాహీన్-III క్షిపణి: ఇది మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 2,750 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉంది. దీనికి న్యూక్లియర్ వార్‌హెడ్ సామర్థ్యం కూడా ఉంది.

అబాబీల్: ఈ క్షిపణిని మొదటిసారి 2017లో పరీక్షించారు. దీని పరిధి సుమారు 2,200 కిలోమీటర్లు. ఇందులో MIRV టెక్నాలజీ ఉంది. వార్‌హెడ్‌లను మోయడానికి దీన్ని రూపొందించారు.

పాక్ వద్ద ఉన్న షాహీన్-III, అబాబీల్ వంటి క్షిపణులతో పోల్చితే పరిధిలో, అధునాతనత టెక్నాలజీలో భారత అగ్ని-V, అగ్ని-VI వంటివి చాలా ముందున్నాయి.