India : 2023లో జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం
ప్రపంచ ఆర్థిక సుపరిపాలనలో ముఖ్య పాత్ర పోషించే జీ-20 గ్రూప్‌నకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు జీ-20 ఫోరం రూపొందింది.

Bharath
G-20 summit : జీ-20 సభ్య దేశాల గ్రూప్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. అందుకు అవసరమైన జీ-20 సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు వెసులుబాటు కలిగించడం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
1999లో జీ-20 ఏర్పాటైంది. ప్రపంచ ఆర్థిక సుపరిపాలనలో ముఖ్య పాత్ర పోషించే జీ-20 గ్రూప్‌నకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు జీ-20 ఫోరం రూపొందింది. దీని సెక్రటేరియట్ 2024 ఫిబ్రవరి వరకు విధులు నిర్వర్తిస్తుంది.
గతేడాది ఇటలీ అధ్యక్షతన జీ-20 సదస్సు జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. గత ఏడాది సమావేశంలో వాతావరణ మార్పులకు కళ్లెం వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని జీ-20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.