Indian Air Force Helicopter : భోపాల్ సమీప పొలాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టరులో సాంకేతిక లోపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా పొలాల్లో దించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు.....

Indian Air Force Helicopter
Indian Air Force Helicopter : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టరులో సాంకేతిక లోపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా పొలాల్లో దించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. (precautionary landing near Bhopal) హెలికాప్టరులో సిబ్బంది సురక్షితమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. (Indian Air Force Helicopter)
LPG cylinder : ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర పెంపు
హెలికాప్టరులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణుల బృందం హెలికాప్టరు దిగిన ప్రాంతానికి రానుంది. భారత వైమానికి దళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ఎంకే 3 హెలికాప్టర్ మిషన్ లో భాగంగా భోపాల్ నుంచి చకేరీకి వెళుతుండగా భోపాల్ విమానాశ్రయం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో దుంగరియా ఆనకట్ట సమీపంలో సురక్షితంగా ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని బెరాసియా గ్రామంలో అత్యవసర ల్యాండింగ్ జరిగింది.