కరియప్పలో కవాతులు : indian army day ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

Indian Army Day 2021 Special : జనవరి 15. ఇండియన్ ఆర్మీ డే. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది.దేశరాజధాని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈరోజు భారతదేశ ఆర్మీ ధైర్యసాహసాలు, శౌర్యం, పరాక్రమాలు, న్ని, ధీరత్వాలు పరేడ్ రూపంలో ఉట్టిపడుతోంది. దేశం కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలు అందజేస్తారు. కరియప్ప గ్రౌండ్‌లో జరిగే ప్రధాన పరేడ్‌లో మిలటరీ హార్డ్‌వేర్, యుద్ధ ట్యాంకులు వంటివి ప్రదర్శిస్తారు.
కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో కవాతు
ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో భారతదేశం 74వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. కవాతులు, సైనిక ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకుంటారు. గత సంవత్సరం నిర్వహించిన ఆర్మీ డే వేడుకల్లో మొట్టమొదటిసారి ఒక మహిళా అధికారి అయిన కెప్టెన్ తానియా షెర్గిల్ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశానికి చెందిన ఒక కమాండర్‌కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటున్నారు. 1949లో భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్.కరియప్ప (KM Carriappa) ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
భారత సైన్యానికి మొదటి ఆర్మీ చీఫ్ కరియప్ప
కె.ఎమ్.కరియప్ప పూర్తిపేరు కోదండెరా కిప్పర్ మదప్ప కరియప్ప. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత మొట్టమొదటి ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్‌గా కరియప్ప విధులు నిర్వర్తించారు.
1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో కరియప్ప వెస్ట్రన్ ఫ్రంట్‌కు కమాండర్‌గా యుద్ధంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన ఇద్దరు వ్యక్తుల్లో కరియప్ప ఒకరు. కర్ణాటకకు చెందిన వారు.
ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి సామ్ మానేక్ష. బ్రిటన్‌లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి ఇద్దరు భారతీయులలో ఆయన ఒకరు. భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్, వెస్టర్న్ కమాండ్స్ కమాండర్‌గా పనిచేశారు.