Indian Army Project Naman : మాజీ సైనికులు,అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ‘ప్రాజెక్ట్ నమన్’
మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ‘ ప్రాజెక్ట్ నమన్ ’ను ప్రారంభించింది.

Indian Army Project Naman
Indian Army Project Naman : దేశం కోసం భారత ఆర్మీ చేసిన త్యాగాలు విలువ కట్టలేనివి.కుటుంబాలకు వదులుకుని..తమ ప్రాణాలకు పణంగా పెట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాచే భారత్ ఆర్మీ సేవలు, వారి త్యాగాలు ఎనలేనివి. వారి గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు సరిపోవు. వారికి ఏమిచ్చినా రుణం తీరదు. అటువంటి మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ‘ ప్రాజెక్ట్ నమన్ ’(Project Naman) ను ప్రారంభించింది. మంగళవారం (సెప్టెంబర్ 5,2023) ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ నమన్ మాజీ సైనికులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల కోసం ఏర్పాటు అయ్యింది.
మాజీ సైనికులు, సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంట్లో భాగంగా మొదటిగా ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో కేంద్రం ఏర్పాటు చేయనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
Mohan Bhagwat : భారత్‌లో కుటుంబ వ్యవస్థ గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు
భారత సైన్యానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఆర్మీ (Directorate of Indian Army)వెటర్నన్స్, హెడ్ డీ ఎప్ సీ బ్యాంకు లిమిటెడ్(HDFC Bank Limited), సిఎస్ఇఇ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ (CSE e-Governance India Limited)దీని కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని సంతకం చేశాయి. దీంట్లో సైనిక కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడానికి ఒక కామన్ సర్వీసు సెంటర్ ఉంటుంది. అలాగే ఈ సెంటర్ అన్ని ప్రభుత్వ కస్టమర్ సేవలను అందిస్తుంది. దాంట్లో సైనికులు కుటుంబాల పెన్షనర్ల ఎకౌంట్స్ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రాజోక్టు రెండో దశంలో దేశవ్యాప్తంగా వివిధ సైనిక స్టేషన్లలలో మరో 13 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.