మూన్ మిషన్.. చంద్రునిపై మనిషి అడుగుపెట్టేలా ఇస్రో ప్లాన్

ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.

మూన్ మిషన్.. చంద్రునిపై మనిషి అడుగుపెట్టేలా ఇస్రో ప్లాన్

Indian on the moon by 2040 what ISRO chief said

Updated On : February 28, 2024 / 5:59 PM IST

Moon Mission: మూన్ మిషన్ తో మరో హిస్టరీ క్రియేట్ కాబోతుందా. అంటే అవుననే అంటోంది ఇస్రో. మన కల నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటోంది. చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టడమే టార్గెట్ గా అడుగులు వేస్తోంది. మనుషులు కూడా ఈజీగా చందమామ మీదకి వెళ్లివచ్చేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. ఇప్పటికే అమెరికా వ్యోమగాములను చంద్రుని మీదకు పంపి రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు భారత్ తమ వంతు అంటోంది. ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.

ఒక్కో అడుగు ముందుకువేస్తూ..
అంతరిక్ష పరిశోధనల్లో ఒక్కో అడుగు ముందుకువేస్తోంది ఇస్రో. కీలక ప్రయోగాలను చేపడుతూ.. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అమెరికా, రష్యా, చైనాలకు సాధ్యం కానివి కూడా భారత్ చేసి చూపిస్తోంది. ఇలా అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి విజయవంతంగా చేరుకుంది. ఇక ఇప్పుడు మనుషులను అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్దమవుతోంది ఇస్రో. మూన్ మిషన్ పేరుతో చంద్రుని మీద మానవులను దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

నాలుగైదేళ్లలో చంద్రయాన్ 4
చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 అంచనాలను మించి సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్టు విజయంతో భారత్ పై ప్రపంచ దేశాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరో నాలుగైదేళ్లలో చంద్రయాన్ 4 ప్రయోగం చేపట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అయితే ఈసారి చంద్రుడిపై చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి శాంపిల్స్ సేకరణతో పాటు వాటిని భూమికి తిరిగి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది.

ఇస్రో టార్గెట్ 2040
మూన్ మిషన్ ఈజీ కాదు. అనుకోగానే ఒకటి, రెండేళ్ల ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం. ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలను దాటి ప్రాజెక్టును సక్సెస్ చేయాల్సి ఉంటుంది. 2040 నాటికి చంద్రునిపై మానవుడు కాలు మోపెలా.. మేడిన్ ఇండియా ప్రయోగం చేయనుంది ఇస్రో. 2040ను ఇస్రో టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పటినుంచే ప్రయత్నాలు, అందుకు కావాల్సిన ప్లానింగ్ ను రెడీ చేసుకుంటోంది. జీరో గ్రావిటీ ఎన్విరాన్ మెంట్ తో ప్రయోగం చేసేందుకు టెక్నాలజీ, సైంటిఫికల్ డెవలప్ మెంట్స్ తో రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది. ఇప్పుడు ఇస్రో దగ్గరున్న టెక్నాలజీ, సైన్స్.. మూన్ మిషన్ కు సరిపోదు. మరింత పటిష్టంగా సమర్థవంతమైన పనితీరుతో అన్ని సమకూర్చుకుంటేనే మూన్ మిషన్ సక్సెస్ అవుతుంది.

వాస్తవానికి మూన్ మిషన్ అనేది నిరంతర ప్రక్రియ. ఒకదాని తర్వాత ఒక ప్రయోగాన్ని పూర్తి చేస్తూ వస్తుంటే.. అందులో ఉన్న లోటుపాట్లు, భవిష్యత్ లో వచ్చే సవాళ్లు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. చంద్రునిపై రోదసి యాత్రకు అయ్యే ఖర్చు కూడా తక్కువేం ఉండదు. ఇప్పుడు ఇస్రో దగ్గరున్న లాంచర్ సామర్థ్యాలు, ప్రయోగశాలల కెపాసిటీ పెరగాల్సిన అవసరం ఉంది. మరో స్పేస్ స్టేషన్ ఏర్పాటు అనివార్యం కావొచ్చు.

సక్సెస్ అయ్యేలా వర్కవుట్
అన్ని వసతులు ఉన్నా.. టెక్నాలజీ, సైన్స్ ను డెవలప్ చేయాలంటే టైమ్ పడుతుంది. ఎందుకంటే స్పేస్ రీసెర్చ్ రోజురోజుకు అప్ గ్రేడ్ అవుతోంది. కొత్తగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నింటినీ అదిగమించి ముందుకు వెళ్లడమనేది సమయంతో కూడుకున్నది.. ఒకటికి రెండుసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.. ఇది తొందరపడి గొప్పలకు పోయి తీసుకునే నిర్ణయం, ప్రయోగం అస్సలు కాదు.. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత అంతర్జాతీయంగా ఇస్రోకు గుర్తింపు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నుంచి చేసే ప్రతీ ప్రయోగం చాలా జాగ్రత్తతో.. సక్సెస్ అయ్యేలా వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. అందుకే 2040 టార్గెట్ గా పనిచేస్తున్నామంటోంది ఇస్రో.

Also Read: ప్రతియుద్ధ నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు.. ఫసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్

అన్ని అవాంతరాలు దాటితేనే భారత్ నుంచి చంద్రుడిపైకి మానవ యాత్ర సాధ్యమవుతుందన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలన్నీ చంద్రునిపై అడుగుపెట్టాలని భావిస్తున్నాయి. అయితే 2040లోపు అమెరికా, చైనాతో పాటు పలు దేశాలు మూన్ మిషన్ పేరుతో వ్యోమగాములను చంద్రునికిపైకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దేశాలు ప్రయోగాలు చేసే సమయంలో వచ్చే సమస్యలు.. వాటి ఫలితాలను చూసి ఓ అంచనాకు రావొచ్చని భావిస్తోంది ఇస్రో. మూన్ మిషన్ కు ప్రస్తుతం మన దగ్గరున్న వనరులు, శక్తి సామర్థ్యాలు సరిపోవని.. అవన్ని సమకూర్చుకోవడం దీర్ఘకాలిక ప్రక్రియ అంటున్నారు అధికారులు. అంతరిక్ష పరిశోధన నిరంతరం కొనసాగుతూనే ఉంటుందంటున్నారు.

సవాళ్లను అధిగమించగలిగితేనే..
అంతరిక్షంలోకి మానవుని ప్రవేశం మరింత ఈజీ కావాలన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. సవాళ్లను అధిగమించగలిగితేనే చంద్రునిపై మానవుడు అడుగు పెట్టడం పాజిబుల్ అవుతుందని చెప్పారు. వ్యోమనౌక చంద్రునిపైకి పంపుతుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రేడియేషన్ నుంచి వ్యోమగాముల సేఫ్టీ.. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్గా ల్యాండింగ్.. అక్కడి నుంచి మళ్లీ తిరిగి భూమిపైకి తీసుకురావడం మరింత కష్టం. ఇదంతా రిస్క్ తో కూడుకున్నదే. అయినా తప్పదు చేసి చూపిస్తామంటోంది ఇస్రో. మూన్ మిషన్ కు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తోంది.

Also Read: స్పేస్ టూరిజంకు పుల్ క్రేజ్‌.. 2030 నాటికి ప్రారంభించే యోచ‌న‌లో భార‌త్..

మూన్ మిషన్ విజయవంతమైతే..
అమెరికా 1969లో ఇద్దరు వ్యోమగాములను అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి పంపింది. అపోలో 11 విజయవంతమైన తర్వాత, అపోలో 17 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి మరో పది మంది వ్యోమగాములను పంపించింది. 1972లో నాసా మూన్ ల్యాండర్ అపోలో 17ను ప్రయోగించింది. స్సేస్ రీసెర్చ్ లో అగ్రదేశాల సరసన చేరేందుకు భారత్ కూడా పెద్దఎత్తున ఖర్చు చేసేందుకు రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఒక దాని తర్వాత ఒక ప్రయోగాన్ని సక్సెస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పెద్ద మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అదే మూన్ మిషన్. ఇది విజయవంతం అయితే అంతర్జాతీయంగా భారత్ కు తిరుగుండదు. కానీ మూన్ మిషన్ ఒక్క ఏడాదిలో అయ్యే పనికాదు. దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. 2030లో ప్రాజెక్టును ట్రాక్ ఎక్కిస్తే పదేళ్లలో పూర్తి చేయొచ్చని భావిస్తోంది ఇస్రో.