ప్రయాణికులకు గుడ్ న్యూస్ : రైలు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ బుకింగ్ కు రెండెంటికీ అందుబాటులోకి రానుంది. మే 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. రైల్వే టికెట్ కౌంటర్లుగానీ, IRCTC ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు.. ఎక్కాల్సిన రైలు బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకునే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్ నుంచి రైలు బయల్దేరానికి 4 గంటల ముందే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వీలుంది.
ఇప్పటికే అమల్లో ఉన్న రైల్వే రూల్స్ ప్రకారం.. టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు.. 24 గంటలు దాటితే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడం కుదరదు. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు కూడా రైలు ఎక్సాల్సిన స్టేషన్ ను మార్చుకోవచ్చు. ఉదాహరణకు.. ప్రయాణికుడు ఎవరైనా.. రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకున్నట్టయితే.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు ఎక్కాల్సి ఉంది.. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల సమయం ముందే తాను మరో స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే.. ఆ స్టేషన్ పేరును మార్చుకోవచ్చు.
మే 1 నుంచి అమల్లోకి :
ఈ కొత్త సదుపాయం మే 1 నుంచి అందుబాటులోకి రానున్నట్టు రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా లేదా నేరుగా రైల్వే కౌంటర్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నాఈ సదుపాయంతో బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వీలుంది. అంతేకాదు.. 139 రైల్వే ఎంక్వైరీ సిస్టమ్ ప్రకారం.. ఏదైనా డిస్టినేషన్ కూడా మార్చుకోవచ్చు. ఈ సౌకర్యం.. తత్కాల్ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి రానుంది. గమనించాల్సి విషయం ఏమిటంటే.. ఒక జర్నీకి రెండుసార్లు మాత్రమే ఆర్జిన్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉంది. ఈ సౌకర్యాన్ని తొలిసారి శతాబ్ధి, రాజధాని ట్రైన్స్ లో ప్రవేశపెట్టనున్నారు.
ఫస్ట్ స్టేషన్ ఫీ.. నో రీఫండ్ :
ఇప్పటికే దీనికి సంబంధించి సెంట్రల్ సాఫ్ట్ వేర్ ను కూడా రైల్వే శాఖ సవరించినట్టు ఓ సర్య్కూలర్ తెలిపింది. బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్నట్టయితే.. ముందుగా రిజర్వ్ చేసుకున్న స్టేషన్ నుంచి చెల్లించిన జర్నీ ఫీ మాత్రం రీఫండ్ కాదు. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన రోజునే రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు.