చైనా నుంచి వచ్చేవారిని విమానాల్లో ఎక్కించుకోవద్దు : ఎయిర్ లైన్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి వచ్చే వారికి బోర్డింగ్ కల్పించవద్దని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశించింది. చైనా నుంచి భారత్ వచ్చే చైనీయులతోపాటు ఇతర ప్రయాణికులను బోర్డింగ్ కు అనుమతించరాదని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత ప్రభుత్వం చైనీయులకు వ్యాలిడ్ వీసాలను రద్దు చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఢిల్లీ-హాంగ్ కాంగ్ ఎయిర్ ఇండియా విమానం నిలిపివేయనునట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుండటంతో ఇటు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే విదేశీయులకు బోర్డింగ్ ను నిరాకరిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాతోపాటు ఇతర దేశాలు చైనాలో ఉన్నవారు, ఆ దేశం నుంచి వచ్చే వారికి భారత్ లోకి అనుమతించరాదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 2 వారాల్లో చైనాలో పర్యటించిన విదేశీయులు, చైనీయులకు వ్యాలిడ్ వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
ఫిబ్రవరి 8 నుంచి ఢిల్లీ-హాంగ్ కాంగ్ ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేయనున్నారు. ఎవరైనా భారతీయులు చైనాలో చిక్కుకున్నట్లైతే నేరుగా భారత ప్రభుత్వం అక్కడి ఎంబసీతో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో తీసుకొస్తుంది. కానీ, కార్పొరేటింగ్ సర్వీసులను మాత్రం పూర్తిగా నిలిపివేసింది. చైనా నుంచి ప్రయాణికులను రష్యా, అమెరికా, జపాన్ లాంటి దేశాలు తమ దేశాలకు చెందిన పౌరులను సైతం స్వదేశాలకు రానివ్వడం లేదు.
కానీ భారత ప్రభుత్వం ఇప్పటికే రెండు విమానాలను పంపించి 600 మంది భారతీయులను సురిక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రత్యేక ఐసోలేటెడ్ సెంటర్లలో ఉంచి వారికి చికిత్స కూడా అందిస్తున్నారు. చైనాలో తాజాగా 425 మంది చనిపోయారు. 20 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చైనా నుంచే కాకుండా, చైనా మీదుగా భారత్ కు వచ్చే విదేశీ ప్రయాణికులను కూడా భారత్ లోకి అనుమతించవద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది.