India’s first voter: స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఓటరు శ్యామ్ సరన్ సింగ్ కన్నుమూత

స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఓటరు శ్యామ్ సరన్ సింగ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయనకు 106 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పాలో శ్యామ్ సరన్ సింగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం తెలిపారు. శ్యామ్ సరన్ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

India’s first voter: స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఓటరు శ్యామ్ సరన్ సింగ్ కన్నుమూత

Updated On : November 5, 2022 / 10:51 AM IST

India’s first voter: స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఓటరు శ్యామ్ సరన్ సింగ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయనకు 106 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పాలో శ్యామ్ సరన్ సింగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం తెలిపారు. శ్యామ్ సరన్ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని చెప్పారు.

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 2నే శ్యామ్ సరన్ సింగ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్నికల సంఘం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా శ్యామ్ సరన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ప్రశంసిస్తూ ఇటీవలే ట్వీట్ చేశారు. అదే శ్యామ్ సరన్ సింగ్ చివరి ఓటు.

శ్యామ్ సరన్ సింగ్ తన తొలి ఓటును 1951, అక్టోబరు 23న కల్పా పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. దాంతో ఆయన దేశ మొట్టమొదటి ఓటరుగా నిలిచారు. ఈ నెల 2న వేసిన ఓటుతో కలిపి ఆయన ఇప్పటివరకు మొత్తం 34 సార్లు ఓటు వేశారు. కాగా, శ్యామ్ సరన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేస్తామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అమందీప్ జార్జ్ చెప్పారు.

శ్యామ్ సరన్ సింగ్ 1917 జులైలో గిరిజనులు అధికంగా ఉండే కిన్నౌర్ జిల్లాలో జన్మించారు. 16 లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఓటు వేయడం గమనార్హం. ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం చేసేవారు. 1951 నుంచి ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేశారని ఎన్నికల అధికారులు చెప్పారు.

 

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..