Mango Man: ఇండియాకే మ్యాంగో మ్యాన్.. 120ఏళ్ల చెట్టుకు 300 వెరైటీలు

Mango Man
Mango Man: ఆయన ఇండియాలోనే ఫ్యామస్. 82ఏళ్ల వయస్సున్న కలీమ్ ఉల్లా ఖాన్ అసలు పేరు అదే అయినా మ్యాంగో మ్యాన్ గానే ఫ్యామస్. రోజూ మైలు దూరానికి పైగా నడిచి తన 120ఏళ్ల వయస్సున్న చెట్టును చూసుకుంటాడు. సంవత్సరాల తరబడి ఆ చెట్టు నుంచి 300కు పైగా వెరైటీలను కాయిస్తున్నాడు. లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో దశాబ్దాలుగా పడిన కష్టానికి ఫలితమే ఇదని అంటున్నారు.
మాములుగా చూస్తే ఇది కేవలం ఒక చెట్టుగానే కనిపించొచ్చు. కానీ, మనస్సు ద్వారా చూస్తే ఒక తోటలా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి కళాశాలగా కనిపిస్తుందని అంటున్నాడు.
తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడే మామిడి రకాలను రూపొందించడానికి మొక్కల భాగాలకు అంటుకట్టేవాడట. ముందుగా తాను పెంచిన చెట్టు నుంచి ఏడురకాలు వచ్చేలా చేయాలనుకున్నాడు కానీ, తుపానుకు అది విరిగిపోయింది.
Read Also: కెమికల్స్ కలిపిన మామిడి పండ్లను గుర్తించండిలా..!
కానీ, 1987 నుంచి ఫోకస్ పెట్టి పెంచుకున్నది ఈ 120ఏళ్ల చెట్టు. ప్రతి ఒక్క రకం వాటి రుచి, ఆకృతి, రంగు, పరిమాణంలో డిఫరెంట్ గా ఉందని చెప్పారు.
అపురూపంగా పెంచుకున్న చెట్టు రకాల్లో కొన్నింటికి విభిన్నమైన పేర్లు పెట్టాడు. ఒకదానికి ఐశ్వర్యరాయ్ అని, మరొక దానికి అనార్కలీ అని, ఇంకొక దానికి సచిన్ టెండూల్కర్ అని.. అలా పేర్లు పెట్టి మనుషులు లేకపోయినా పండ్ల రకాలు ఉండిపోతాయి. అలా వారిని ఈ పండ్ల ద్వారా అందరూ గుర్తుంచుకుంటారని చెప్తున్నారు ఈ మ్యాంగో మ్యాన్.