అమిత్ షాకు ఒవైసీ కౌంటర్: భారత్ అంటే హిందీ, హిందువులు, హిందూత్వమే కాదు

అమిత్ షాకు ఒవైసీ కౌంటర్: భారత్ అంటే హిందీ, హిందువులు, హిందూత్వమే కాదు

Updated On : September 14, 2019 / 8:13 AM IST

సెప్టెంబరు 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఒకే భాషలో మాట్లాడాలని అదీ హిందీనే మాట్లాడని పిలుపునిచ్చిన షాకు వ్యతిరేకంగా స్పందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 

మంత్రిగారూ..ఆయా రాష్ట్రాల ప్రజలు వారి భాషల్లోని భిన్నత్వాన్ని, అందాన్ని…వారి భాష మాట్లాడేటప్పుడు వారు అనుభవించే ఆనందాన్ని..సౌఖ్యాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి అంటూ చురకలు వేశారు.

ఒవైసీ ట్వీట్‌లో ‘హిందీ భారత దేశంలో అందరి మాతృభాష కాదు. ఈ నేలపై ప్రతి ప్రాంతపు మాతృభాషలోని అందాన్ని అభినందించగలరా..? ఆర్టికల్ 29 ప్రతి ఒక్కరి భాష, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచిస్తోంది. భారతదేశం హిందీ, హిందువులు, హిందూత్వం కంటే చాలా పెద్దది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు సైతం దేశపౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ప్రముఖులంతా దేశ ప్రజలకు శుభాకాంక్షలు ప్రకటిస్తూ.. దేశమంతా ఒకే భాష.. ఒకటే అనే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు.