బొద్దింక ఉందని..IndiGoకు రూ. 50 వేల ఫైన్

బొద్దింక ఉందని సమాచారం ఇచ్చినా..స్పందించని IndiGoకు రూ. 50 వేల ఫైన్ విధించింది. పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానం. 2018 నుంచి ఈ కేసు కొనసాగుతోంది. చివరకు తీర్పునివ్వడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది. వివరాల్లోకి వెళితే…
స్కంద్ అసీమ్ బాజ్ పాయ్, సురభి రాజీవ్ భరద్వాజ్‌లు ఇద్దరు..ఢిల్లీ నుంచి పుణెకు ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో 2018, డిసెంబర్ 31వ తేదీన బయలుదేరారు. కూర్చొన్న సీటు కింద బొద్దిక ఉందని వారు గమనించారు. సీటు కింద బొద్దింక ఉంది..దీనివల్ల తాము అసౌకర్యానికి గురవుతున్నాం..దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సిబ్బందికి సమాచారం అందించినా..నిర్లక్ష్యంగా వ్యవహరించారు..విమానం దిగిన అనంతరం బాధితులు విమానయాన సంస్థపై ఢిల్లీ కార్యాలయంలో కంప్లయింట్ చేశారు. బొద్దింక ఉన్న ఫొటోను కూడా చూపించారు. ఇది అంత పెద్ద నేరమేమి కాదని కొట్టిపారేశారు.
చివరకు వీరిద్దరూ పుణె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అనేక నోటీసులు పంపించింది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. ఇండిగో అధికారులు విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు నష్టపరిహారం అందించాలని ఇండిగోను ఆదేశించింది. టికెట్ ఛార్జీ రూ. 8 వేల 574లకు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More : ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు..కోటి ఆర్థిక సహాయం