indigo : ఆరుగురే ఉన్నారంటూ ప్రయాణీకుల్ని దింపేసిన ఇండిగో

కేవలం ఆరుగురు ప్రయాణీకులే ఉన్నారని అమృత్ సర్ నుంచి చెన్నై వెళ్లే క్రమంలో మధ్యలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను దింపేసింది.

indigo : ఆరుగురే ఉన్నారంటూ ప్రయాణీకుల్ని దింపేసిన ఇండిగో

indigo flight

Updated On : November 21, 2023 / 3:26 PM IST

indigo flight : ఇండిగో విమానంలో తక్కువమంది ప్రయాణీకులు ఉన్నారంటూ వారి దింపేసింది. కేవలం ఆరుగురు ప్రయాణీకులే ఉన్నారని అమృత్ సర్ నుంచి చెన్నై వెళ్లే క్రమంలో మధ్యలోనే బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని దింపివేసింది. ఈ ఆరుగురు ప్రయాణీకుల్లో వృద్ధులు కూడా ఉన్నారు. దీంతో వారంతా చెన్నైకి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.

ఇండిగో విమానం 6E478 అమృత్‌సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రయాణికులందరూ దిగిపోగా కేవలం ఆరుగురు మాత్రం చెన్నై వెళ్లేవారు ఉన్నారు. దీంతో కేవలం ఆరుగురు ప్రయాణీకుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వెళ్లేందుకు ఇష్టపడలేదు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పి దింపివేశారు సిబ్బంది. కానీ అటువంటిదేమీ చేయలేదు. దీంతో వృద్ధులతో సహా ఆరుగురు ఆ రాత్రి అంతా బెంగళూరు ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం ఉదయం బయటకు వెళ్లారు. ఇండిగో యాజమాన్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు.

దీనిపై విమర్శలు రావటంతో ఇండియో యాజమాన్యం స్పందించి ఆ ప్రయాణీకులను ఉదయాన్నే వేరే విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. కానీ అదంతా పచ్చి అబద్దమని కనీసం తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రయాణీకుల విషయంలో ఇలా వ్యహరించినందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.