Indo-Bangla Rail : ఇండో-బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు ప్రారంభం నవంబర్ 1న

ఇండో -బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు నవంబర్ 1వతేదీన ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నవంబర్ 1వతేదీన రెండు రైల్వే ప్రాజెక్టులు, మెగా పవర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు....

Indo-Bangla Rail : ఇండో-బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు ప్రారంభం నవంబర్ 1న

Indo-Bangla Rail Power Project

Updated On : October 30, 2023 / 12:09 PM IST

Indo-Bangla Rail : ఇండో -బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు నవంబర్ 1వతేదీన ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నవంబర్ 1వతేదీన రెండు రైల్వే ప్రాజెక్టులు, మెగా పవర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారుర. బంగ్లాదేశ్ ఖుల్నా డివిజన్‌లోని రాంపాల్ వద్ద 1320-మెగావాట్ల మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, 15.064 కిమీ అఖౌరా-అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్, 86.87-కిమీ ఖుల్నా-మోంగ్లా పోర్ట్ రైలు లైన్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

Also Read : Jammu and Kashmir: : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, చొరబాటు యత్నం విఫలం.. బంకర్లు సిద్ధం

అఖౌరా-అగర్తలా కొత్త రైలు మార్గంలో 5.05 కి.మీలు భారతదేశంలో, 10.014 కి.మీలు బంగ్లాదేశ్‌లో ఉంటుంది. పశ్చిమ త్రిపురలోని నిశ్చింతపూర్ వద్ద అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ స్టేషన్ ద్వారా బంగ్లాదేశ్‌లోని అఖౌరాను కలుపుతోంది. భారతదేశం నిధులతో ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రాజెక్ట్.

Also Read : Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్

2010వ సంవత్సరం జనరవరిలో బంగ్లాదేశ్ ప్రధాని తన న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు ఈ రైల్వే లైను నిర్మాణాన్ని ఖరారు చేశారు. త్రిపుర, అసోం, మిజోరాం దక్షిణ భాగం రైలు ద్వారా కోల్‌కతాకు వెళ్లడానికి 22 గంటల ప్రయాణాన్ని ఆదా చేస్తుంది.