Viral Video: అందరి ముందు.. సీఎం ప్రైవేట్ సెక్రటరీ, కలెక్టర్ ముఖాలపై ఇంకు చల్లిన యువకుడు

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని..

Viral Video: అందరి ముందు.. సీఎం ప్రైవేట్ సెక్రటరీ, కలెక్టర్ ముఖాలపై ఇంకు చల్లిన యువకుడు

Viral Video - Odisha

Updated On : August 19, 2023 / 7:04 PM IST

Viral Video – Odisha: అందరి ముందు సీఎం ప్రైవేట్ సెక్రటరీ, కలెక్టర్ ముఖాలపై ఇంకు చల్లాడో యువకుడు. ఈ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లా( Puri district) సత్యబాదీలోని ఉత్కలమణి గోపబంధు స్మృతి మహావిద్యాలయా వద్ద చోటుచేసుకుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రైవేట్ సెక్రటరీ వీకే పాండియన్, పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ్ వర్మ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలోనే వారిపై ఓ యువకుడు ఇంక్ చల్లాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడు సత్యబాదీ అసెంబ్లీ నియోజక వర్గంలోని హరీపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ సాహూ అని గుర్తించారు. అతడి దాడి వల్ల వీకే పాండియన్ ముఖంపైనే కాకుండా తెల్ల చొక్కాపై ఇంకు పడింది.

అయినప్పటికీ వీకే పాండియన్ కార్యక్రమంలో అలాగే చిరునవ్వుతో పాల్గొనడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత ఆరోపించారు. ఆయన ఆరోపణలను బీజేపీ ఖండించింది.

Washington : అతనికి 88.. ఆమెకు 85.. 66 పెళ్లిరోజు మౌంట్ వాషింగ్టన్‌పై చేసుకున్న వృద్ధ జంట