Sarojini Lakra : కాళ్లకు చెప్పులు కూడా లేని స్థాయి నుంచి ఐపీఎస్ వరకు .. గిరిజన మహిళ సరోజినీ లక్రా ఇన్స్పిరేషనల్ స్టోరీ

కష్టాలు లక్ష్యాలకు అడ్డంకి కాకూడదు.. ఓడిపోతామనే నిరుత్సాహం దరి చేరకూడదు. అనుకున్నది సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే చాలు సరోజినీ లక్రాలా ముందుకి సాగిపోతారు. ఎవరావిడా? ఆవిడ లైఫ్ స్టోరీ ఏంటి?

Sarojini Lakra : కాళ్లకు చెప్పులు కూడా లేని స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ..  గిరిజన మహిళ సరోజినీ లక్రా ఇన్స్పిరేషనల్ స్టోరీ

Sarojini Lakra

Updated On : October 5, 2023 / 4:47 PM IST

Sarojini Lakra : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితులు.. కాలికి చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్లు నడిస్తే కానీ సాగని స్కూలు చదువులు.. ఇవేమీ ఆమె లక్ష్యాలను అడ్డుకోలేకపోయాయి. 37 ఏళ్లు కానిస్టేబుల్‌గా సేవలను అందించి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన సరోజినీ లక్రా జీవితం చాలామంది మహిళలకు ఆదర్శం.

Inspirational Story of Bharathi : కూలి పని చేస్తూ కెమెస్ట్రీలో PHD చేసిన సాకే భారతి స్ఫూర్తివంతమైన కథ

సరోజినీ లక్రా నిరాడంబరమైన గిరిజన నేపథ్యం నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారిగా ఎదిగారు. అంత అంత సులభంగా జరగలేదు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సరోజినీ లక్రాకి చిన్నప్పటినుంచి ఆటలంటే మక్కువ. ఇంటి పరిస్థితులు ఏవీ ఆమె ఇష్టాలను అడ్డుకోలేకపోయాయి. కాళ్లకి చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో రోజు 5 కిలోమీటర్లు స్కూలుకి నడిచి వెళ్లి చదువుకున్నారామె. పట్టుదలతో ఆటలు ఆడి బహుమతులు గెలుచుకున్నారు. మొదటిసారి వచ్చిన నగదు బహుమతితో తన కుటుంబానికి ఒక ఆవుని కొనిచ్చారు సరోజిని. ఇది ఆమె విజయానికి మొదటి అడుగు అని చెప్పాలి.

ప్రతి వ్యక్తిలో ప్రతిభ దాగి ఉంటుంది. అది మనం గుర్తించాలి.. లేదంటే ఇతరుల ప్రోత్సాహం అయినా ఉండాలి. సరోజినీలోని ప్రతిభను కోచ్ రాబర్ట్ కిస్పొట్టా కనిపెట్టి ఎంతగానో ప్రోత్సహించారు. తన స్పోర్ట్స్ అకాడమీలోకి ఆహ్వానించడం ద్వారా ఆమె తన జిల్లాకు జార్ఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పలు క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించారు. అంతేకాదు స్పోర్ట్స్ కోటా ద్వారా కానిస్టేబుల్ వృత్తిలో అడుగుపెట్టారు. అలా 37 సంవత్సరాలపాటు కానిస్టేబుల్‌గా ప్రజల భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం సరోజినీ లక్రా పోలీస్ సూపరింటెండెంట్ (SP) గా పనిచేస్తున్నారు.

ఓ మూల కూర్చోకండీ..లేచి ఏదోకటి చేయండీ..వీడియోలతో హుషారెత్తిస్తున్న 81 ఏళ్ల బామ్మ

దృఢ సంకల్పం మరియు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని సరోజినీ లక్రా నిరూపించారు. నిరాడంబరమైన జీవితం నుండి IPS అధికారిగా ఆమె ఎదిగిన తీరు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగానో.. ఇంకేదో కారణాలతో తాము జీవితంలో ఎదగలేకపోయామని చాలామంది నిరుత్సాహపడుతుంటారు. అలాంటివారికి సరోజినీ లక్రా వంటి మహిళలు ఎంతో ఆదర్శం అని చెప్పాలి.