Vande Bharat Express : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక .. స్పందించిన IRCTC
వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.

Vande Bharat Express
Vande Bharat Express : భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు IRCTC అందిస్తున్న ఆహారంలో నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసాడు. తాను తిన్న భోజనంలో బొద్దింక కనిపించిందని అతను పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై IRCTC స్పందించింది.
Vande Bharat New colours : మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్ చూశారా..?
ఇటీవల భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చేసిన ఓ వ్యక్తికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దీనిపై అతను ఆందోళన వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో (@subodhpahalajan) పోస్టు పెట్టాడు. “@IRCTCofficial నా ఆహారంలో, వందే భారత్ రైలులో బొద్దింక కనిపించింది” అనే శీర్షికతో తను అందుకున్న ఆహారపు ఫోటోలను యాడ్ చేస్తూ షేర్ చేశాడు. ఫోటోలలో రోటీలలో ఒకదానికి చిన్న బొద్దింక అంటుకున్నట్లు కనిపించింది. ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ఇదే మార్గంలో ప్రయాణించిన చాలామంది కలుషిత ఆహారం విక్రయిస్తున్నారని, ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని కామెంట్లు చేశారు.
ఇక ఈ పోస్టుపై IRCTC సత్వరమే స్పందించింది. ‘IRCTC సత్వర చర్య తీసుకుంది. ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదని.. కఠినమైన హెచ్చరికతో లైసెన్స్‌దారుపై చర్యలు తీసుకోబడ్డాయని’ రిప్లై ఇచ్చింది. ఈ పోస్టు వైరల్ అవుతోంది. అనేకమంది తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook?? (@subodhpahalajan) July 24, 2023