Anand Mahindra : ‘వావ్ అత్యద్భుతం..ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి’
‘వావ్ అత్యద్భుతం..ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి’ ఆనంద్ మహేంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఎక్స్ లెంట్

anand mahindra
Anand Mahindra : వావ్ అత్యద్భుతం..అడవిలో ఉన్నట్లుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి’ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను షేర్ చేశారు. ట్విట్టర్ పేజీలో వినూత్న ఫోటోలు..వీడియోలు పోస్ట్ చేసే ఆనంద్ మహేంద్రా మరో అద్భుతమైన వీడియోను షేర్ చేశారు.ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుత కళలకు ప్రతీరూపంగా ఉందీ వీడియో. మన కళ్లను మనమే నమ్మలేనట్లుగా మరో ప్రపంచంలోకి తీసుకుపోయారు కళాకారులు.
శరీరంపై జంతు ఆకారాలను పెయింట్ గా వేసుకుని.. శరీర అవయవాలను పక్షులు, జంతువుల మాదిరి ఆకారంలోకి వంపు చేసి… అచ్చం పక్షి లేదా జంతువు అని భ్రమ పడేలా చేయడం అనేది ఏమాత్రం సాధారణమైనది కాదు. ఓ టాలెంట్ హంట్ షోలో భాగంగా కళాకారులు చేసిన ఈ విన్యాసాలను ఆనంద్ మహేంద్రా మరోసారి ఈ చేశారు. ‘‘వావ్ అత్యద్భుతం..అడవిలో ఉన్నట్లుంది ట్టుంది. చివరి దాని కోసం వేచి చూడండి’’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు. వీడియో చివర్లో పెద్దపులి దర్శనమిస్తుంది. అది కూడా ఓ కళాకారుడి కృషికి సహజమైన ప్రతిభ అని తెలిస్తే వావ్ ఇది నిజంగా అద్భుతమే కాదు అత్యద్భుతం అని తీరాల్సిందే..ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ..ఆ అనుభూతిని ఆస్వాదించండీ..
Fantastic. #Friday in the Forest. Wait for the last one… pic.twitter.com/puTdrKTlMW
— anand mahindra (@anandmahindra) December 9, 2022