Chhattisgarh: అయ్యో తల్లీ.. చిన్నవయస్సులోనే ఎంత కష్టమొచ్చింది.. అయినా టెన్త్‌లో టాపర్.. 15లక్షలకుపైగా ఖర్చు చేసిన తండ్రి..

టెన్త్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఇషికా బాలా తండ్రి శంకర్ సామాన్య రైతు.

Chhattisgarh: అయ్యో తల్లీ.. చిన్నవయస్సులోనే ఎంత కష్టమొచ్చింది.. అయినా టెన్త్‌లో టాపర్.. 15లక్షలకుపైగా ఖర్చు చేసిన తండ్రి..

ishika bala

Updated On : May 11, 2025 / 9:49 AM IST

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఇషికా బాలా అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఆ రాష్ట్రంలో టాపర్ గా నిలిచింది. అయితే, ఆ బాలికకు చిన్నవయస్సులోనే పెద్ద కష్టమొచ్చింది. ఇషికా బాలా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా చదువును మాత్రం పక్కన పెట్టలేదు. పట్టుదలతో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకుంది.

Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్‌షాక్.. ఇప్పట్లో వారికి ఇళ్లు లేనట్టే..!

టెన్త్ ఫలితాల్లో ఇషిక 99.2శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి కాంకేర్ జిల్లాకే పేరుతెచ్చింది. మహిళా అక్షరాస్యత రేటు 59.6శాతం మాత్రమే ఉన్న ఆ ప్రాంతానికి ఇషిక విజయం కొత్త ఆశాకికరణం. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఇషిక.. గత సంవత్సరం టెన్త్ పరీక్షకు హాజరు కాలేకపోయింది. కానీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చికిత్స పొందుతూనే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరై టాపర్ గా నిలిచింది. ఐఏఎస్ కావాలన్నది తన కల అని ఇషిక బాలా చెప్పంది.

Also Read: Telangana Govt: టెన్త్ పాస్ అయిన విద్యార్ధినిలకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఇషికా బాలా తండ్రి శంకర్ సామాన్య రైతు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన బిడ్డను కాపాడుకునేందుకు, ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేసేందుకు అనేక ఆస్పత్రులకు తిప్పాడు. ఈ క్రమంలో ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ.15లక్షలుకుపైగా ఖర్చు చేశాడు. ఇషిక చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య యోజన కింద ఇషిక బాలా ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన సహాయం అందేలా చూస్తామని జిల్లా అధికారులు చెప్పారు. చదువుల తల్లి బ్లడ్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఐఏఎస్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.