Axiom 4 mission: వారెవ్వా.. అంతరిక్ష కేంద్రానికి నీటి ఎలుగును పంపనున్న ఇస్రో.. ఎందుకంటే?
ఈ పరిశోధన భారత మిషన్ గగన్‌యాన్‌కు కూడా ఉపయోగపడుతుంది.

water bear
అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ యాక్సియమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కి ఓ ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన నాసా, స్పేస్‌ఎక్స్ సహా భారత్‌కు చెందిన ఇస్రో వంటివాటితో కలిసి యాక్సియమ్ స్పేస్ పనిచేస్తోంది.
యాక్సియమ్ స్పేస్ తమ ప్రయోగాన్ని ఈ ఏడాది మేలో చేయనుంది. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ -G213 స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. ఈ మిషన్ వ్యవధి 14 – 21 రోజులు. క్రూ సభ్యులు మొత్తం నలుగురు ఉంటారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభమ్ శుక్లా కూడా ఐఎస్‌ఎస్‌కి వెళ్లనున్నారు.
నీటి ఎలుగుబంటిని ఎందుకు పంపుతారు?
ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములతో పాటు నీటి ఎలుగుబంటి కూడా అంతరిక్షానికి వెళ్లనుంది. యాక్సియమ్ మిషన్‌ను ప్రైవేట్ వ్యోమనౌక క్రూడ్రాగన్ జీ213 ద్వారా పంపించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇస్రో వర్గాలు చెప్పాయి.
Also Read: ఉప్పల్ స్టేడియంలో ఈ పెవిలియన్ నుంచి అజారుద్దీన్ పేరు తొలగింపు.. ఎందుకంటే?
నీటి ఎలుగుబంటి చాలా అరుదైన జీవులు. ఇవి 0.3 మిల్లీమీటర్లు – 0.5 మిల్లీమీటర్ల మధ్య పొడవు ఉంటాయి. ఇవి చాలా కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకుంటాయి. ఈ జీవుల్లో అటువంటి అరుదైన డీఎన్‌ఏ ఉంటుంది. నీటి ఎలుగుబంట్లలో పర్వతాలతో పాటు సముద్రాలు, ఎడారుల వంటి ప్రాంతాల్లోనూ నివసించే శక్తి ఉంటుంది.
ఇవి అధికంగా నీటి ఊబిలో జీవిస్తాయి. ఈ నీటి ఎలుగుబంట్ల దేహంలోని కణాలు నీటిని భర్తీ చేసుకుంటాయి. దీంతో కొన్న ఏళ్లపాటు అదే నీటితో జీవిస్తాయి. వీటి డీఎన్‌ఏను ఇస్రో డీకోడ్ చేసింది. గురుత్వాకర్షణ శక్తి అతి తక్కువ ఉండే ప్రాంతంలో పునరుత్పత్తిపై పరిశోధన చేస్తుంది. భూమితో పాటు అంతరిక్షంలో వీటి జన్యు మార్పిడి చేసే విషయంపై అధ్యయనం చేస్తుంది.
ఈ పరిశోధన ఫలితాలు వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సాయపడతాయి. సూర్యరశ్మి విపరీతంగా ఉండే పరిస్థితి, గురుత్వాకర్షణ తక్కువ ఉండే ప్రాంతంలో నీటి ఎలుగుబంటి డీఎన్‌ఏలో కలిగే మార్పులకు తగ్గట్లు వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేస్తారు. ఈ పరిశోధన భారత మిషన్ గగన్‌యాన్‌కు కూడా ఉపయోగపడుతుంది.