Sonia Gandhi : ఈ బిల్లు మాది, మా కల : మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

మహిళా బిల్లును లోక్ సభలో ఈరోజు మధ్యాహ్నాం ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రవేశ పెట్టాక దీనిపై చర్చను రేపు కొనసాగించనున్నారు. అలాగే మహిళా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామాలన్ని ఇక మహిళా బిల్లుకు విముక్తి కలుగనుంది అనేలా ఉన్నాయి.

Sonia Gandhi : ఈ బిల్లు మాది, మా కల : మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Sonia Gandhi..Women's reservation bill

Sonia Gandhi..Women’s reservation bill : ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s reservation bill)ఈరోజు లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ (Union Law Minister Arjun Ram)మహిళా బిల్లును లోక్ సభలో ఈరోజు మధ్యాహ్నాం ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ప్రవేశ పెట్టాక దీనిపై చర్చను రేపు కొనసాగించనున్నారు. అలాగే మహిళా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామాలన్ని ఇక మహిళా బిల్లుకు విముక్తి కలుగనుంది అనేలా ఉన్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ (Cabinet of Prime Minister Narendra Modi)మహిళా బిల్లుకు ఆమోదం పలకటం దాన్ని కొత్త పార్లమెంట్ (New Parliament)లో జరుగున్న తొలి సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఎంతోమంది దీనిపై తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi)మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని ‘‘ హమారా బిల్లు హై’’ [ఇది మా బిల్లు]..మహిళల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో పట్టుబడుతోంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లు తమ కల అని అన్నారు సోనియా గాంధీ.

Women Reservation Bill : ఈరోజు లోక్‌సభకు మహిళా రిజర్వేషన్ బిల్లు .. రేపు చర్చ

ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తు..ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఉన్న వివరాల కోసం వేచి చూస్తున్నామన్నారు. బిల్లును సీక్రెట్ గా రూపొందించకుండా… ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరితో చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబం స్పందిస్తు..ఈ బిల్లును సభలో ప్రవేశపెడితే మహిళా రిజర్వేషన్ బిల్లును యూపీఏ ప్రభు్తవంలోని కాంగ్రెస్, మిత్రపక్షాల విజయం అని పేర్కొన్నారు.

కాగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010 మార్చి 9న రాజ్యసభలో మహిళా రిజర్వేషన బిల్లు ఆమోదం పొందగా.. లోక్‌సభలో మాత్రం చర్చకు రాలేదు. రాజ్యసభలో కూడా తీవ్ర గందరగోళం మధ్యలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో కాంగ్రెస్ ఈ బిల్లు ఆమోదం పొందితే అది కాంగ్రెస్ క్రిడిట్ గా భావిస్తోంది.

Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

2010లో రాష్ట్రీయ జనతాదళ్,సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ తెగల కోటాలో కోటా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ముందుకు తీసుకురాలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం పలకాలనే ఉద్దేశంతో ఇన్నేళ్ల తరువాత తెరమీదకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే అది ఎవరి క్రెడిట్ అనేది పక్కన పెడితే మహిళా సాధికారతకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా..దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. బిల్లు ఇంతవరకు పార్లమెంటులో ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పటికే పలుసార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ… పూర్తి స్థాయి మెజార్టీ లభించక అన్నిసార్లు వీగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అన్ని అవరోధాలు ఎదుర్కొని బిల్లు ఆమోదం పొందితే మహిళా సాధికారతకు బాటలు వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

కొత్త పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనే ఉద్ధేశంతోనే మోదీ కేబినెట్ నిర్ణయించి ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అలా ఈ బిల్లు ఆమోదం కొత్త పార్లమెంట్ చరిత్రలో నిలిపోయేలా చేయాలనే యోచనతో మోదీ ప్రభుత్వం తాజాగా ఈ బిల్లును తీసుకురానుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇలా మోదీ కేబినెట్ ఆమోదం పలకటం..కొత్త పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లున ప్రవేశపెట్టటం వంటి పలు శుభపరిణామాల మధ్య విపక్షాలు కూడా ఈ బిల్లును స్వాగతిస్తుండటంతో… ఈసారి ఈ బిల్లు ఉభయసభల ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.