Jaishankar : మరణశిక్ష పడిన భారతీయుల కుటుంబాలను కలిసిన మంత్రి జైశంకర్

ఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు....

Jaishankar : మరణశిక్ష పడిన భారతీయుల కుటుంబాలను కలిసిన మంత్రి జైశంకర్

Jaishankar

Updated On : October 30, 2023 / 11:28 AM IST

Jaishankar : ఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు. శిక్షపడిన భారతీయ కుటుంబసభ్యుల బాధలను తాను తెలుసుకున్నానని, వారి విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Also Read : Jammu and Kashmir: : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, చొరబాటు యత్నం విఫలం.. బంకర్లు సిద్ధం

వారి కుటుంబసభ్యుల బాధలను తాను అర్థం చేసుకున్నానని మంత్రి చెప్పారు. గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లోని 8 మంది మాజీ భారత నేవీ సిబ్బందికి గత వారం ఉరిశిక్ష విధించారు. 2022వ సంవత్సరం ఆగస్టులో ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భారతీయ పౌరులను అరెస్టు చేసింది.

Also Read : Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్

అయితే వారిపై అభియోగాలను న్యూఢిల్లీ లేదా దోహా అధికారికంగా వెల్లడించలేదు. తాను శిక్షపడిన కుటుంబసభ్యులతో సమన్వయం చేసురకొని వారిని విడుదల చేయించేందుకు యత్నిస్తామని మంత్రి జై శంకర్ ఎక్స్ లో పోస్టు చేశారు.