Minister Chandrashekhar: బిహార్ మంత్రి వ్యాఖ్యల్ని ఖండించిన జేడీయూ.. విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గని మంత్రి
ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అయితే చంద్రశేఖర్ నాలుక కోయడానికి 10 కోట్ల రూపాయల వెల కట్టారు

JD(U) condemns Bihar minister's Ramcharitmanas remark
Minister Chandrashekhar: రామచరితమానస్పై బిహార్ విద్యాశాఖ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మిత్ర పార్టీ జనతాదశ్ యూనియన్ ప్రకటించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య అయోమయాన్ని ఏర్పరుస్తున్నాయని, అంతే కాకుండా మహాఘట్ బంధన్ పట్ల సైతం ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని ఆ పార్టీ నేత అశోక్ చౌదరి అన్నారు. చంద్రశేఖర్ వ్యాఖ్యల వివాదంపై రాష్ట్రంలో లేచిన దుమారంపై ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
Sharad Yadav: శరద్ యాదవ్ చొరవ చూపకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు
కాగా, ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అయితే చంద్రశేఖర్ నాలుక కోయడానికి 10 కోట్ల రూపాయల వెల కట్టారు. ఇంత దుమారం రేగినా ఆ మంత్రి తన వ్యాఖ్యలను మరింత సమర్ధించుకోవడం గమనార్హం. అయితే క్షమాపణ చెప్పడం గురించి స్పందిస్తూ, అలాంటిది జరిగే సమస్యే లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
Rajasthan: కాంగ్రస్ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్
రామచరితమానస్ విధ్వేషాలు రెచ్చగొడుతుందంటూ మంత్రి చంద్రశేఖర్ మొదట వ్యాఖ్యానించారు. అనంతరం, తీవ్ర దుమారం రేగడంతో తన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ‘‘మనుస్మృతి, రామచరితమానస్, గురు గోల్వాల్కర్ పుస్తకాలు ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలు. ద్వేషం దేశాన్ని గొప్పగా చేయదు, ప్రేమ దేశాన్ని గొప్పగా చేస్తుంది’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్లో చెప్పారు. ఇది సమాజంలోని దళితులు-వెనుకబడినవారు, మహిళలు విద్యను పొందకుండా నిరోధిస్తుంది’’ అని అన్నారు.
Bharat Jodo Yatra: ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ హెచ్చరిక
ఇక ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్పుడు బాగానే ఉన్న రాముడు, అకస్మాత్తుగా కులవివక్ష రాముడిగా ఎలా మారాడని ప్రశ్నించారు. తాను బహుజన సమాజం గొంతుక వినిపిస్తున్నానని, బహుజనులను ఆయా గ్రంథాల్లో తీవ్రంగా అవమానించారని చంద్రశేఖర్ అన్నారు.