MLA Spotted In Undergarments : రైలు బోగీలో అర్ధనగ్నంగా తిరిగిన ఎమ్మెల్యే

బీహార్ లోని భాగల్‌పూర్ ఎమ్మెల్యే, జేడీయూ నాయకుడు గోపాల్ మండల్ గురువారం తేజాస్ రైలు, సెకండ్ ఏసీ కోచ్‌లో అండర్ వేర్, బనీయన్‌తో అర్ధనగ్నంగా తిరుగుతూ పలువురికి ఇబ్బంది కలిగించాడు.

MLA Spotted In Undergarments : రైలు బోగీలో అర్ధనగ్నంగా తిరిగిన ఎమ్మెల్యే

JDU MLA spotted in Undergarments

Updated On : September 3, 2021 / 3:57 PM IST

MLA Spotted In Undergarments :  రైలు ప్రయాణం అనగానే కొంతమంది మగవాళ్లు రైలు తమ సొంతిల్లులాగా…. ఇంట్లో ఉన్నట్లు పొట్టి నిక్కర్లు, టీ షర్టులు వేసుకుని ప్రయాణం చేస్తుంటారు. ఇంకొందరైతే లుంగీ కట్టి, చేతుల్లేని బనీను వేసుకుని జర్నీ చేసేస్తూ ఉంటారు. అది వాళ్లకు సౌకర్యవంతంగా ఉంటుందేమో కానీ, రైలులో ప్రయాణించే మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచించరు.

తాజాగా బీహార్ లోని భాగల్‌పూర్ ఎమ్మెల్యే, జేడీయూ నాయకుడు గోపాల్ మండల్ గురువారం తేజాస్ రైలు, సెకండ్ ఏసీ కోచ్‌లో అండర్ వేర్, బనీయన్‌తో అర్ధనగ్నంగా తిరుగుతూ పలువురికి ఇబ్బంది కలిగించాడు.

పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజ‌స్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం గోపాల్ మండ‌ల్ ప్రయాణించారు. ప్రయాణంలో ఉండగా ఆయన వాష్ రూమ్ కు వెళ్లేందుకు ఒంటిమీద ఉన్న బట్టలు అన్నీవిప్పేసి బనీయన్ అండర్‌వేర్‌తో కోచ్‌లో అటు  ఇటూ తిరిగారు. అందుకు సహ ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

ఒకనొక  దశలో కాల్చిపారేస్తానని ఆయన ప్రయాణికులను బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలును దిల్‌దార్ నగర్ జంక్షన్‌లో నిలిపివేశారు. తాను వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు అలా బట్టలు విప్పేసానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

రైల్వే టీటీఈ, ఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చి ప్రయాణికులకు నచ్చచెప్పి   ఆయన్ను వేరే బోగీలోకి తరలించి రైలును ముందుకు నడిపించారు.  కాగా ….. ఎమ్మెల్యే  రైలులో అర్ధనగ్నంగా తిరుగుతున్న దృశ్యాలను ఎవరో ప్రయాణికుడు  చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.