JEE Advanced 2022 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్స్ వీరే..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ బాంబే ఆదివారం విడుదల చేసింది.

JEE Advanced 2022 Result
JEE Advanced 2022 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ బాంబే ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ఆర్.కె. శిశిర్ జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. మహిళా విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్క కాబ్రా 16తో టాప్ ర్యాంక్‌గా నిలిచింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది.
JEE Advanced Results: నేడు విడుదల కానున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితం 2022ని పొందడానికి అభ్యర్థులు తమ రోల్ నంబర్‌లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఫలితాలతో పాటు, JEE అడ్వాన్స్‌డ్ 2022 మెరిట్ జాబితా, సమాధానాల కీ కూడా విడుదల చేయబడ్డాయి. ఇదిలాఉంటే కామన్ ర్యాంక్ లిస్ట్ లో జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2022 ఫలితాల్లో టాప్ -10లో ఆర్. కె. శిశిర్, పోలు లక్ష్మిసాయి లోహిత్ రెడ్డి, థామస్ బిజు చీరంవేల్లి, వంగపల్లి సాయి సిద్ధార్థ, మయాంక్ మోత్వాని, పోలిశెట్టి కార్తికేయ, ప్రతీక్ సాహూ, ధీరజ్ కురుకుంద, మహిత్ గాధివాలా, వెచ్చ జ్ఞాన మహేష్ లు ఉన్నారు.
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభవుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 1,567సీట్లను సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.