JEE Main 2021: నేటి నుంచి JEE మెయిన్ మూడవ విడత పరీక్ష!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మూడవ విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే

JEE Main 2021: నేటి నుంచి JEE మెయిన్ మూడవ విడత పరీక్ష!

Jee Main 2021

Updated On : July 20, 2021 / 6:26 AM IST

JEE Main 2021: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వం పలు అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మూడవ విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా దీనిలో భాగంగా ఇప్పటికే మొదటి రెండు సెషన్లను నిర్వహించింది.

మూడు, నాలుగో సెషన్లు ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్‌టీఏ మూడో విడుత పరీక్ష తేదీలను నిర్వహిస్తుంది. ఆన్​లైన్ లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 7.09 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఈ నెల 20, 22, 25, 27 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు గంటన్నర ముందు నుండే విద్యార్థులను అనుమతించనున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరగనుండగా ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలతో పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిచేందుకు పరీక్ష కేంద్రాలను పెంచారు.