Favipiravir, రూ. 39కే కరోనా ట్యాబ్లెట్

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మందుల కంపెనీలు పలు ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. అందులో Favipiravir ట్యాబ్లెట్స్ ఒకటి. వీటి ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా రూ. 39 కే కరోనా ట్యాబ్లెట్ అందిస్తామని jenburkt pharmaceuticals కంపెనీ వెల్లడించింది.
ఫావివెంట్ పేరిట మార్కెట్ లోకి విడుదల చేశామని తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్ 200 మిల్లిగ్రాముల బరువు ఉంటుందని, ఒక్కో స్ట్రిప్ లో 10 ట్యాబ్లెట్లు వస్తాయని కంపెనీ ఛైర్మన్ ఆశిక్ యూ భూటా తెలిపారు. ఫావిపిరవిర్ మందుల తయారీకి సిప్లా ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతినిచ్చింది.
సిప్లెంజా పేరిట విడుదల చేసే ట్యాబ్లెట్ రూ. 68కి విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫార్మా సంస్థ ఫావిపిరవిర్ పేరిట యాంటీ వైరల్ డ్రగ్ ను తీసుకొచ్చింది. దీని ధర చాలా తక్కువ అని తెలుస్తోంది. దేశీయంగా జెనరిక్ మందును తయారు చేయాలని ప్రభుత్వం భావించింది. ఐఐసీటీ హైదరాబాద్‌ను సంప్రదించగా స్థానికంగా దొరికే రసాయనాలతో ఫావిపిరవిర్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు.
గ్లెన్‌మార్క్‌కు చెందిన ‘ఫాబిఫ్లూ’ రూ.75కు ఒక ట్యాబ్లెట్ విక్రయిస్తోంది. మహారాష్ట్రకు చెందిన బ్రింటన్ ఫార్మా ‘ఫావిటన్’ పేరుతో రూ.59కే విక్రయిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా ‘ఫావికొవిడ్-200’ పేరుతో త్వరలో ట్యాబ్లెట్లను విక్రయించనున్నట్టు చెప్పింది.