కుప్పకూలిన స్టేజీ..రైతు నేత టికాయత్ కు గాయాలు

rakesh tikaits:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బుధవారం హర్యానాలోని జింద్‌లో “మహాపంచాయత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేయూ నేత రాకేష్ తికాయత్‌తో పాటు పలు సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.
ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కూలిపోవడంతో దానిపైనున్న వారంతా కిందపడిపోయారు. దీంతో రాకేష్ తికాయత్ సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు, చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ తికాయత్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. చట్టాలను రద్దు చేయకపోతే, తాము ఇళ్లకు వెళ్లేది లేదని, ఇదే తమ నినాదమని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమం అక్టోబరుకు ముందు ముగిసే ప్రసక్తే లేదన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఉద్యమం ముగిసేది లేదన్నారు.
#WATCH | The stage on which Bharatiya Kisan Union (Arajnaitik) leader Rakesh Tikait & other farmer leaders were standing, collapses in Jind, Haryana.
A ‘Mahapanchayat’ is underway in Jind. pic.twitter.com/rBwbfo0Mm1
— ANI (@ANI) February 3, 2021