కన్హయ్య కుమార్‌పై చార్జ్‌షీట్

న్యూఢిల్లీ : మాజీ జేఎన్‌యూ నేత కన్హయ్య కుమార్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చార్జ్‌షీట్ నమోదు చేసింది. ఆయనతో పాటు పలువురు జేఎన్‌యూ నేతలపై షీట్ నమోదు చేశారు. ఈయనతో పాటు 9మంది విద్యార్ధి నేతలపై చార్జ్ షీట్ నమోదైంది.
దేశద్రోహం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూ క్యాంపస్‌లో అప్జల్ గురుకు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారు.
కన్హయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యా, సయ్యద్ ఉమర్ ఖలీద్‌తో పాటు కాశ్మీర్ ప్రాంత వాసులైన పలువురు స్టూడెంట్స్‌పై చార్జ్‌షీట్ నమోదైంది. సుమారు 1200 వంద పేజీల చార్జ్‌షీట్ ఉంది.
ఇదిలా ఉంటే 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కన్హయ్య కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐ పార్టీ నుండి ఆయన బరిలో నిలుస్తారని..ఇతనికి కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.