Narendra Modi: మోదీకి ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్న జో బైడెన్!

ఆ తదుపరి రోజు వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు.

Narendra Modi: మోదీకి ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్న జో బైడెన్!

Narendra Modi, Joe Biden (File Pic)

Updated On : June 19, 2023 / 3:56 PM IST

Narendra Modi – US Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న మోదీ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 5 రోజుల పాటు అమెరికా(USA), ఈజిప్టు(Egypt)ల్లో పర్యటిస్తారు.

జో బైడెన్ తో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ తో మోదీ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, అదే రోజు రాత్రి జో బైడెన్ తో ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు.

ఆ తదుపరి రోజు వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు. బైడెన్‌ తో మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజున కూడా భారత ప్రధాని గౌరవార్థం జో బైడెన్ దంపతులు ప్రభుత్వ లాంఛనాలతో డిన్నర్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే అంతకు ముందు రోజున కూడా బైడెన్ ప్రైవేటు డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Rich Indians: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?