Johnson & Johnson: భారత్‌లో పిల్లలకు సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్
జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి దరఖాస్తు చేసుకుంది.

Jj
Johnson & Johnson: గ్లోబల్ హెల్త్ మేజర్లలో ఒకటైన జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి దరఖాస్తు చేసుకుంది. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేసేదానికి సంబంధించి అధ్యయనం చేయడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది జాన్సన్ & జాన్సన్ కంపెనీ. సింగిల్-షాట్ వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ 85శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కంపెనీ చెబుతుంది.
కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే చిన్నారులు సహా అందరికీ వెంటనే వ్యాక్సినేషన్ చేయడం అత్యవసరమని చెబుతున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ.. 12-17 ఏళ్ల వారిపై సింగిల్ డోసు కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతి కోరుతుంది. పెద్దల కోసం సింగిల్ డోసు జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇదివరకే భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.
లేటెస్ట్‌గా దరఖాస్తు చేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్‌కు అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు వేసే వ్యాక్సిన్ జాబితాలో ఇది చేరుతుంది. ఈ వ్యాక్సిన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్అండ్ జాన్సన్ ఇండియా ప్రకటించింది.