డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?

మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదా? ఓసారి చెక్ చేసుకోండి.

  • Published By: sreehari ,Published On : March 27, 2019 / 09:28 AM IST
డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?

Updated On : March 27, 2019 / 9:28 AM IST

మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదా? ఓసారి చెక్ చేసుకోండి.

మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదా? ఓసారి చెక్ చేసుకోండి. వెంటనే మీ ఆధార్ – పాన్ కార్డు లింక్ చేసుకోండి. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఆధార్ కార్డుతో PAN కార్డు లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఇదే లాస్ట్ డేట్.
Read Also : డ్యాన్స్ మాస్టర్ జానీకి జైలు శిక్ష

పన్నుదారుల కోసం.. కొన్నాళ్లుగా ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకునే గడువు తేదీలను పొడిగిస్తూ వస్తున్నారు. తొలుత జూన్ 30, 2018 గడువు విధించగా.. ఆ తర్వాత మార్చి 31, 2018 వరకు గడువు విధించారు. అది కాస్తా 2019, మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించారు. ఆధార్, పాన్ కార్డు లింకింగ్ ప్రాసెస్ ను ఎన్నోసార్లు పొడిగించినప్పటికీ కొంతమంది తమ కార్డులను లింక్ చేసుకోలేకపోయారు. ఇప్పటివరకూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోనివారు ఎలా లింక్ చేసుకోవాలో ఈ కింది విధంగా ఫాలో అవ్వండి. 

1. ఆన్ లైన్ లింకింగ్ : 
మీ పాన్ కార్డు నెంబర్ ను ఆధార్ కార్డుతో రెండు రకాలుగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి.. ఇన్ కమ్ ట్యాక్స్ ఈ-ఫీల్లింగ్ పోర్టల్ విజిట్ చేయడం.. ఇక రెండోవది.. ఈ-ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ కావడం, అకౌంట్ లో లాగిన్ అవసరం లేకుండా కూడా లింక్ చేసుకోవచ్చు. 

a) e-Filling అకౌంట్ లో User Login అవసరం లేకుండా ఆధార్-పాన్ ఇలా Link చేసుకోవచ్చు. 

i) ఈ పోర్టల్ వెబ్ సైట్ ను.. www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి. 
ii) లింక్ ఆధార్.. Link Aadhaarఅనే ఆప్షన్ కనిపిస్తుంది.. ఈ లింక్ పై క్లిక్ చేయండి.
iii) అవసరమైన వివరాలు.. అంటే.. మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి 
iv) మీ వివరాలను వెరిఫై చేశాక Submit బటన్ పై క్లిక్ చేయండి.
v) UIDAI నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. 

b) మీ e-Filing అకౌంట్ లో User Login అయ్యాక కూడా ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. 

i) www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి. ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయిన మీ అకౌంట్ నుంచి ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఎలానంటే?

ii) మీ అకౌంట్ లో లాగిన్ కాగానే.. ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్, ఆధార్ కార్డు లింక్ చేసుకునే ఆప్షన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. వెబ్ సైట్ లోని Top bar పై ఉన్న బ్లూ ట్యాబ్ దగ్గర  (Profiles Settings) అని ఉంటుంది. అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ లో లాగిన కాగానే పాప్ అప్ విండో కనిపించలేదంటే? 
iii)ఈ-ఫిల్లింగ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయ్యే సమయంలో మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసే ఉంటారు కదా. ఈ వివరాలతో మీ ఆధార్ కార్డును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 
iv) మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.. Captcha code ఎంటర్ చేసి.. లింక్ నౌ (Link Now)పై క్లిక్ చేయండి. 
v) మీకు ఓ Pop-Up మెసేజ్ వస్తుంది. మీ ఆధార్ కార్డు సక్సెస్ ఫుల్ గా పాన్ కార్డుతో లింక్ అయినట్టుగా కనిపిస్తుంది.  

2. SMS ద్వారా ఆధార్-పాన్ కార్డు లింకింగ్ చేసుకోవాలంటే? 
పన్నుదారులు తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డును SMS విధానం ద్వారా కూడా సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానంపై ఆదాయ పన్ను శాఖ కూడా నోటిఫై చేసింది. ఆధార్-పాన్ కార్డు SMS ద్వారా లింక్ చేసుకోవాలంటే?

i) మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ నుంచి  567678 లేదా 56161 నంబర్ కు SMS చేయాలి.  
ii) మీరు పంపించే SMS ఫార్మాట్ UIDPAN <12సంఖ్యల ఆధార్ నంబర్>10సంఖ్యల PAN నంబర్ టైప్ చేసి.. పైన ఇచ్చిన రెండు నంబర్లలో ఏదో ఒక నంబర్ కు Send చేయాలి. 
iii) ప్రాసెస్ కంప్లీట్ కాగానే.. మీకు వెంటనే సక్సెస్ ఫుల్ అయినట్టుగా confirm మెసేజ్ వస్తుంది. 

మీ వివరాలు ఎంటర్ చేసినప్పుడు సరిపోలకుంటే.. (mismatch) లేదా ఎర్రర్ వస్తే ఏం చేయాలంటే? 

* మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డుపై ఉన్న మీ పేరు సరిపోలకుంటే.. (mismatch) అని వస్తే మాత్రం.. OTP ద్వారా ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 
* ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే.. కీలకమైన వివరాలను సరిగా ఎంటర్ చేయాలి. అవి.. మీ పేరు, పుట్టినతేదీ, జెండర్, (male, female) చెక్ చేసుకోవాలి. 

నోట్ :  ఒకవేళ PAN card లోని మీ Name.. Aadhaar Card లోని మీ Name వేర్వేరుగా ఉంటే మాత్రం..  ఆధార్-పాన్ కార్డు Linking process చేయలేరు.  

Only one Way :  ఆధార్, పాన్ కార్డు లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలంటే.. ఒకటే మార్గం.. ఆధార్, పాన్ కార్డు డేటాబేస్ లో ఉన్న మీ పేరును ఏదోఒకదానికి మ్యాచ్ అయ్యేలా మార్చుకోవడమే.. త్వరపడండి.. లేదంటే.. మీ పాన్ కార్డు యాక్సస్ కోల్పోయే అవకాశం ఉంది. 
Read Also : జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్