Agra : జువెనైల్ హోమ్‌లో ఘోరం.. బాలికల్ని తాడుతో కట్టి.. చెప్పుతో కొట్టిన సూపరింటెండెంట్

బాలనేరస్థుల్ని సంస్కరించాల్సిన ఓ అధికారిణి వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది. బాలికల్ని చెప్పుతో కొట్టి, తాడుతో కట్టేసి విపరీతంగా ప్రవర్తించింది. ఆగ్రా జువైనల్ హోమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Agra : జువెనైల్ హోమ్‌లో ఘోరం.. బాలికల్ని తాడుతో కట్టి.. చెప్పుతో కొట్టిన సూపరింటెండెంట్

Agra

Updated On : September 14, 2023 / 4:22 PM IST

Agra :  ఓ ప్రభుత్వ అధికారిణి సహనం కోల్పోయింది. జువైనల్ హోమ్‌లో పిల్లల్ని సంస్కరించాల్సిన ఆమె వారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఓ బాలికను తాడుతో కట్టి.. మరో బాలికను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో ఆ అధికారిపై కేసు నమోదైంది.

Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం

ఆగ్రాలోని జువైనల్ హోంలో సీసీ ఫుటేజ్ ద్వారా షేరైన వీడియోలు అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. ముందుగా సోమవారం విడుదల చేసిన వీడియోలో ఓ గదిలో ఆరుగురు బాలికలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. జువైనల్ హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్ లోనికి ప్రవేశించి కనికరం లేకుండా ఓ బాలికను కొట్టడం, ఇతర బాలికలను తిట్టడం.. తోటి ఉద్యోగి చూస్తుండగానే ఒక బాలికను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది.

మంగళవారం కలవరపెట్టే మరో వీడియో బయటకు వచ్చింది. ఏడేళ్లు కూడా లేని ఒక అమ్మాయి మంచంపై ఉంది. ఆమెకి కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోలన్నీ బయటకు రావడంతో పూనం పాల్‌ను సస్పెండ్ చేసి ఆమెపై కేసులు నమోదు చేసారు.  గతంలో ప్రయాగ్ రాజ్‌లోని జువైనల్ హోమ్‌లో కూడా పూనమ్ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఆగ్రా డివిజన్ కమిషనర్ రీతూ మహేశ్వరి పూనమ్ పాల్‌తో పాటు ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించామని, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినట్లు వెల్లడించారు.

Pune : BTSపై పిచ్చి.. 500 రూపాయలతో పూణే నుంచి సౌత్ కొరియాకు పయనమైన బాలికలు.. చివరికి ఏమైందంటే?

ఆగ్రా జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జి, షెల్టర్ హోమ్ కమిటీ చైర్ పర్సన్ జువైనల్ హోంను పరిశీలించారు. బాల నేరస్థులు ఉండే ఒక గదిలో బీడీలు, పొగాకుతో పాటు ఖైదీలలో ఒకరి వద్ద అనుమతించిన దానికంటే ఎక్కువ డబ్బు ఉండటం గమనించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా సరిపోవడం లేదని తేలింది.