వీడియో: ప్రచారంలో భాగంగా.. రోడ్డుపై కమల్ హాసన్ కూతురితో స్టెప్పులేసిన హీరోయిన్..

వీడియో: ప్రచారంలో భాగంగా.. రోడ్డుపై కమల్ హాసన్ కూతురితో స్టెప్పులేసిన హీరోయిన్..

Kamal Haasan’s Campaign

Updated On : April 4, 2021 / 2:21 PM IST

Kamal Haasan’s Campaign: తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అధికారం కోసం పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎత్తులు, పొత్తులు విషయంలో క్లారిటీగా ఉన్న పార్టీలు.. ఎన్నికల ప్రచారంలో బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొత్తగా పెట్టిన పార్టీతో ఎన్నికల బరిలో దిగగా.. ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కమల్ హాసన్ కోసం ఎన్నికల ప్రచారంలో తన చెల్లెలు సుహాసిని, కూతురు అక్షరహాసన్ ముమ్మరంగా తిరుగుతున్నారు. లేటెస్ట్‌గా వీరిద్దరు కలిసి రోడ్డుపై స్టెప్పులేస్తూ.. చేసిన ప్రచారం ఆకట్టుకుంటుంది.

తమిళనాడులో.. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పీపుల్స్ జస్టిస్ నాయకుడు కమల్ హాసన్‌కు మద్దతుగా సుహాసిని, కమల్ రెండవ కుమార్తె అక్షర హసన్ ప్రచారం చేస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) తరపున కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు.