Kangana Ranaut : ఢిల్లీలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయబోయే తొలి సెలిబ్రిటీ ఎవరంటే…

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు....

Kangana Ranaut : ఢిల్లీలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయబోయే తొలి సెలిబ్రిటీ ఎవరంటే…

Kangana Ranaut

Updated On : October 24, 2023 / 5:55 AM IST

Kangana Ranaut : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు. ఈ ఏడాది కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.

Also Read : Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం…మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీల విడుదల

ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నా, రావణ్ దహన్ కార్యక్రమాన్ని మాత్రం కంగనా చేయనున్నారు.

Also Read : CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

దీంతో రాంలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు. ఆర్‌ఎస్‌విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్‌లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.