బిచ్చగాళ్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన టెంపుల్ సంస్థ
ఈ బిచ్చగాళ్లలో కొందరు భిక్ష పెట్టకపోతే అనుచితంగా ప్రవర్తిస్తూ, నేరస్థులతో కలిసి వారికి ఇన్‌ఫార్మర్లుగా కూడా పని చేస్తున్నారు. ఒకవేళ అవకాశం దొరికితే ప్రయాణికుల వద్ద ఉన్న లగేజీని..

బిచ్చగాళ్ళు అనేగానే మనకు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు మూవీ గుర్తుకొస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మందికి అడుక్కునే వాళ్లపై జాలి కలిగింది. కాయిన్ కి రెండు వైపులు ఉన్నట్లే బిచ్చగాళ్లలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు.
కొందరు పని చేసుకోవడానికి కూడా శరీరం సహకరించకనో లేక అంగ వైకల్యంతోనో యాచకులుగా మారుతారు. మరికొందరు అన్ని ఉండీ భిక్షాటననే వ్యాపారంగా చేసుకొని జీవిస్తుంటారు. డబ్బుల సంచులు వాళ్ల దగ్గర దొరకడం వంటి దృశ్యాలను సోషల్ మీడియాలలో మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం.
అసలు విషయంలోకి వద్దాం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సిటీలో జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వేల సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు భిక్షాటన చేస్తున్నారు. ఈ బిచ్చగాళ్లలో కొందరు భిక్ష పెట్టకపోతే అనుచితంగా ప్రవర్తిస్తూ, నేరస్థులతో కలిసి వారికి ఇన్‌ఫార్మర్లుగా కూడా పని చేస్తున్నారు. ఒకవేళ అవకాశం దొరికితే ప్రయాణికుల వద్ద ఉన్న లగేజీని కూడా లాక్కెళ్తున్నారు.
దీంతో కాన్పూర్ పంచముఖి హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు… ఆలయ ప్రాంగణం వద్ద బిక్షాటన చేస్తున్న నిరుపేద బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. భిక్షాటన మానేసి ఉద్యోగాలు చేస్తే యాచకులకు ఆలయ పాలకవర్గం ఆశ్రయం కల్పిస్తుందన్నారు. అవసరమైన ఖర్చులు కూడా చెల్లిస్తామని, యాచించడం మానేయాలని చెప్పారు.
అంతేగాక ఆలయ ప్రాంగణంలో కూర్చొని పని చేయడానికి సిద్ధంగా ఉన్న బిచ్చగాళ్లతో మాట్లాడతామని చెప్పారు. గుడిలో పని కూడా ఇప్పిస్తామన్నారు. వారి బస, భోజన ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చూసుకుంటరని కమిటీ తెలియ జేసింది. ఈ విధంగా చేస్తే బిచ్చగాళ్లు మారే అవకాశం ఉందని కమిటీ భావిస్తోంది.
Read Also: హలో లేడీస్.. డ్రై ఫ్రూట్ నగల్ని చూసారా? భలే ఉన్నాయి..