కరోనా పాజిటివ్ వచ్చినా KCET అనుమతించిన కర్ణాటక

కరోనా పాజిటివ్ వచ్చినా KCET అనుమతించిన కర్ణాటక

Updated On : July 21, 2020 / 8:54 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టులు చేయించుకుని అందులో పాజిటివ్ ఫలితాలు వచ్చినా కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్(KCET)2020కు షెడ్యూల్ ప్రకారమే అనుమతిస్తామని తెలిపింది. జులై 30, 31తేదీల్లో దాదాపు 1.94లక్షల మంది విద్యార్థులు ఈ టెస్టు రాసేందుకు హాజరుకానున్నారు.

ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వనాథ్‌నారాయణ్ అంశంపై మాట్లాడుతూ.. ‘(KCET)2020 షెడ్యూల్ ప్రకారమే జులై 30, 31నే నిర్వహిస్తారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసిన అన్ని గైడ్‌లెన్స్‌కు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తారు. డిప్యూటీ కమిషనర్లంతా ప్రత్యేక పరీక్షా కేంద్రాలను, గదులను కరోనా టెస్టుల్లో పాజిటివ్ తేలిన విద్యార్థుల కోసం సిద్ధం చేయాలి’ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భద్రత ఇన్విజిలేటర్ల భద్రత ముఖ్యమని పికప్, డ్రాపింగ్ ల కోసం అంబులెన్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా శాఖ ఇన్‌ఛార్జి అయిన అశ్వనాథ్‌నారాయణ్.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ రూల్స్ నుంచి మినహాయించాం. ‘ఇతర రాష్ట్రాల నుంచి 1871 క్యాండిడేట్లు టెస్ట్ రాయడానికి వస్తున్నారు. వారిని హోం క్వారంటైన్ నియమాల నుంచి మినహాయిస్తున్నాం. కర్ణాటకకు 96గంటల వరకూ అనుమతులు ఇస్తున్నాం’ అని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షా 94వేల 356మంది విద్యార్థులు 497పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తున్నారు. బెంగళూరు నుంచే 40వేల 200మంది రాజధాని ప్రాంతం నుంచి 83ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష రాస్తున్నారు.