కర్ణాటక బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు : శివకుమార్ అరెస్ట్ వెనుక సిద్ధరామయ్య హస్తం

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2019 / 12:02 PM IST
కర్ణాటక బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు : శివకుమార్ అరెస్ట్ వెనుక సిద్ధరామయ్య హస్తం

Updated On : September 8, 2019 / 12:02 PM IST

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కేసుకి  కాంగ్రెస్ ఎల్పీ లీడర్,మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగల్ కోట్ లో ఇవాళ(సెప్టెంబర్-8,2019)నళిన్ కుమార్ కతీల్ మాట్లాడుతూ… డీకే శివకుమార్ కేసుకి సిద్ధరామయ్యే కారణమని తనకు సందేహమన్నారు. డీకే శివకుమార్ ఎదుగుదల చూసి తట్టకోలేక సిద్ధరామయ్య తట్టకోలేకపోయాడని అన్నారు. శివకుమార్ అరెస్ట్ వెనుక సిద్ధరామయ్య ఉండటానికి ఇదే కారణమంటూ నళిన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన డికె శివకుమార్‌ను మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబర్-3,2019న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శివకుమార్ కు ఈనెల 13 వరకు ట్రయల్ కోర్టు 10రోజుల కస్టడీ విధించింది.