Congress MLA : బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బీజేపీని నిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

Congress MLA : బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Congress MLA BR Patil

Updated On : September 26, 2023 / 6:45 AM IST

Congress MLA : బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బీజేపీని నిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (Congress MLA BR Patil) రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి కాషాయ పార్టీ రామ మందిరంపై బాంబు దాడి చేసి, ముస్లిం సమాజంపై నిందలు వేసే అవకాశాలు ఉన్నాయని బీఆర్ పాటిల్ చెప్పారు. (Congress MLA remark sparks row)

Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా

‘‘మోదీ తన తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీనే రామమందిరంపై బాంబులు వేసి ముస్లింలపై నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి. హిందువులను సంఘటితం చేయండి’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎక్స్ లో పంచుకున్న వీడియోలో పేర్కొంది. కాగా ఎమ్మెల్యే పాటిల్ ఎప్పుడు ఆ వ్యాఖ్య చేశాడనే దానిపై స్పష్టత లేదు. బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోను బీజేపీ సోమవారం షేర్ చేసింది.

BMW : భారత మార్కెట్లోకి కొత్తగా బీఎండబ్ల్యూ ఐ ఎక్స్1 పూర్తి ఎలక్ట్రిక్ కారు

పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లిం ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని బీజేపీ ఆరోపించింది. హిందూ మతం పునాదిని ప్రశ్నించడానికి బయలుదేరిన కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికే రామమందిరంపై తమ చెడు దృష్టి వేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.