మహాతల్లి.. కుట్లు వెయ్యాల్సింది పోయి.. ఏడేళ్ల పిల్లాడికి ఫెవిక్విక్ తో అంటబెట్టిందట..

కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెంపపై గాయంతో ఏడేళ్ల చిన్నారి ఆస్పత్రికి వెళితే నర్సు పెవిక్విక్ తో వైద్యం చేసింది.

మహాతల్లి.. కుట్లు వెయ్యాల్సింది పోయి.. ఏడేళ్ల పిల్లాడికి ఫెవిక్విక్ తో అంటబెట్టిందట..

shocking incident

Updated On : February 6, 2025 / 1:48 PM IST

Karnataka: చిన్న పిల్లలు, పెద్దలు ఏ వయస్సువారైనా గాయంతో ఆస్పత్రికి వెళితే తగ్గేందుకు ఆయింట్మెంట్ ఇస్తారు. అదే.. పెద్దగాయం అయితే.. చిన్నపాటి శస్త్ర చికిత్స తరహాలో కుట్లు వేసి ఆ గాయం నయం అయ్యేందుకు మందులు రాసిస్తారు. కానీ, కర్ణాటకలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే నర్సు వింతగా ప్రవర్తించింది. ఏడేళ్ల బాలుడికి కంటి కింది భాగంలో లోతైన గాయం అయింది. దీంతో బాలుడ్ని అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చెంపపై గాయమైన ప్రదేశంలో కుట్లు వేయాల్సిన నర్సు.. అతని గాయంపై ఫెవిక్విక్ తో వైద్యం చేసింది. దీంతో ఆ పిల్లవాడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. నర్సు తీరుపై బాలుడి తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Shekhar Basha: శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ..

హవేరి జిల్లా హనగల్ తాలూకాలోని అదూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. బాలుడి పేరు గురుకిషన్ అన్నప్ప హోసమణి. ఆడుకుంటున్న క్రమంలో చెంప పైభాగంలో గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యసేవల నిమిత్తం అదూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీలో నర్సు జ్యోతి ఉన్నారు. బాలుడి చెంపపై గాయంను పరిశీలించిన నర్సు.. కుట్లు వేయకుండా ఫెవిక్విక్ పూసేందుకు ప్రయత్నించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించడంతో.. గాయానికి కుట్లు వేయడం వల్ల చెంపపై గాయం కనిపించేలా మచ్చ ఏర్పడుతుంది. అందుకే ఫెవిక్విక్ పెడుతున్నా అంటూ నర్సు జ్యోతి తన తీరును సమర్ధించుకుంది. అంతేకాదు.. ఒకవేళ ఈ విధానం వల్ల గాయం నయం కాకపోతే మేము మళ్లీ చికిత్స చేస్తాం అంటూ నర్సు బదులిచ్చింది.

Also Read: Ghost Call : ఘోస్ట్ కాల్ అంట.. అబ్బా.. ఏం టెక్నాలజీరా నాయనా.. నసగాళ్ల నుంచి మస్త్ తప్పించుకోవచ్చు..!

బాలుడి తల్లిదండ్రులు నర్సు చేసిన చికిత్స పట్ల ఆందోళనతో మళ్లీ ఆమెను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె స్పందనకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఉన్నతాధికారులకు పంపించారు. ఆ వీడియోలో నర్సు గాయంపై ఫెవిక్విక్ వాడినట్లు పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే డీఎం అండ్ హెచ్ఓ రాజేష్ సురగిహళ్లి వెంటనే స్పందించి నర్సు జ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సు తీరుపట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలకు చికిత్స చేయడానికి వైద్యేతర పదార్థాలను వాడటం వల్ల గాయమైన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, నర్సు చేసింది చాలా పొరపాటు అంటూ వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.