Half Pants Police Station : నిక్కర్‌లో వచ్చారని.. ఫిర్యాదు తీసుకోకుండా పంపేసిన పోలీసులు

కోల్ కతాలో ఆసక్తికర ఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు.

Half Pants Police Station : నిక్కర్‌లో వచ్చారని.. ఫిర్యాదు తీసుకోకుండా పంపేసిన పోలీసులు

Half Pants Police Station

Updated On : July 24, 2021 / 9:52 PM IST

Half Pants Police Station : కోల్ కతాలో ఆసక్తికర ఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు. అందుకు కారణం… వారిద్దరూ జిమ్ లో ధరించే నిక్కర్లు (షార్ట్స్) వేసుకుని ఉండడమే. ఇటీవల కోల్ కతాలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వారిద్దరూ ఈ నెల 17న కోల్ కతాలోని కస్బా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, పోలీసులు వారి నుంచి ఫిర్యాదును స్వీకరించలేదు.

“మీరు షార్ట్ లు ధరించి వచ్చారు… లోపల స్టేషన్ లో మహిళా పోలీసులు ఉన్నారు. మిమ్మల్ని లోపలికి అనుమతించలేం” అని పోలీస్ స్టేషన్ బయట ఉన్న హోంగార్డు వారికి స్పష్టం చేశారు. ప్యాంట్లు వేసుకుని రావాలని దత్తా, అవిషేక్ లకు పోలీసులు సూచించారు. వారు చెప్పినట్టే ప్యాంట్లు వేసుకుని వస్తే, అప్పుడు పీఎస్ లోపలికి అనుమతించడమే కాకుండా, వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు.

ఈ వ్యవహారంలో పోలీసుల తీరును వివరిస్తూ ఆ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. డ్రెస్ కోడ్ ఏదైనా ఉందా? అని వారు ప్రశ్నించారు. దాంతో కోల్ కతా పోలీసులు దీటుగా స్పందించారు. మీ కార్యాలయాలకు మీరు షార్ట్ లపైనే వెళతారా? అని తిరిగి ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారం దుమారం రేపడంతో కోల్ కతా పోలీసులు దీనిపై విచారణకు ఆదేశించారు.