Kejriwal: కాస్త ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తానంటున్న కేజ్రీవాల్

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మొహల్లా దవాఖానాలకు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‭కు స్ఫూర్తని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇక ఢిల్లీ పాఠశాలలను తమిళనాడు ముఖ్యమంత్రి స్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన అన్నారు.

Kejriwal: కాస్త ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తానంటున్న కేజ్రీవాల్

Kejriwal said that with a little patience, all the promises will be fulfilled

Kejriwal: అన్ని పార్టీలలాగే ఎన్నికల్లో అనేక హామీలిచ్చి పంజాబ్‭లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇచ్చిన మాట ప్రకారం, ఐదేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తుందట. అయితే అందుకు ప్రజల కాస్త ఓపిక పట్టాలని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కోరారు. తాజాగా రాష్ట్రంలో 400 మొహల్లా ప్రాంతీయ వైద్యశాలలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‭తో కలిసి ప్రారంభించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Amrit Udyan: రాష్ట్రపతి భవన్‭లోని ముఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‭గా మార్చిన కేంద్రం

‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలల్లోనే 500 మొహల్లా ప్రాంతీయ వైద్యశాలలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఉన్న వైద్య వ్యవస్థకు తోడు వీటితో మరిన్ని వైద్య సేవలు అందిస్తాం. 70 ఏళ్లు పాలించినవారు పంజాబ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. దాన్ని బాగు చేయాలంటే సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టండి. ఇచ్చిన హామీలన్నీ ఈ ఐదేళ్లలో నెరవేరుస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Twitter Users : మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిందా? ఫిబ్రవరి 1 నుంచి అప్పీల్ చేసుకోవచ్చు..!

ఇక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మొహల్లా దవాఖానాలకు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‭కు స్ఫూర్తని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇక ఢిల్లీ పాఠశాలలను తమిళనాడు ముఖ్యమంత్రి స్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన అన్నారు.