Kerala Covid Update: జూన్ 15లోగా 40ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్!

కేరళలో జూలై 15 లోపు 40 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  పినరయి విజయన్ ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

Kerala Covid Update: జూన్ 15లోగా 40ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్!

Kerala Covid Update

Updated On : June 6, 2021 / 6:45 AM IST

Kerala Covid  Vaccinate All Update: కేరళలో జూలై 15 లోపు 40 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  పినరయి విజయన్ ఆరోగ్య అధికారులను ఆదేశించారు. ఈ నెలలో తమ రాష్ట్రానికి 38 లక్షల మోతాదులు లభిస్తాయని అన్నారు. జూలై 15 లోపు 40 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని సీఎం ఆదేశించారని సిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ముందుగా మానసిక వికలాంగులను ప్రాధాన్యతా జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జూన్ 4 (శుక్రవారం) వరకు రాష్ట్రం ఒక కోటి వ్యాక్సిన్లను ఇచ్చిందన్నారు.  ఇప్పటివరకూ  78,75,797 మందికి టీకా మొదటి మోతాదును ఇవ్వగా,  21,37,389 మందికి రెండవ మోతాదు వేశారు. జార్జ్ ఇప్పటివరకు 1,04,13,620 మోతాదుల వ్యాక్సిన్ అందుకున్నారు . అందులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 8,84,680 మోతాదులు ఉన్నాయి. ఇందులో 7,46,710 మోతాదుల కోవిషీల్డ్, 1,37,580 మోతాదుల కోవాక్సిన్ ఉన్నాయి.

అంతేకాకుండా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండవ మోతాదును నాలుగు నుండి ఆరు వారాల వ్యవధిలో, విదేశాలకు వెళ్లే వారికి కూడా ఇవ్వాలని కేరళ నిర్ణయించింది. కేరళలో కొత్తగా 17,328 కోవిడ్ -19 కేసులు, 209 మంది మరణించారు. రాష్ట్ర మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 25,88,385 కు చేరగా, మరణాల సంఖ్య 9,719 కు పెరిగింది.

24 గంటల్లో, కొవిడ్ -19 నుంచి 24,003 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ లెక్కను 24,40,642 కు చేరింది. ఇక జిల్లాల్లో తిరువనంతపురంలో 2,468 అత్యధిక కేసులు నమోదయ్యాయి. మలప్పురం 1,980, పాలక్కాడ్ 1,899 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,67,638 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వారిలో 34,925 మంది వివిధ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.