Special Marriage: పదేళ్లుగా ఇంట్లో దాచి పెట్టి ఎట్టకేలకు మతాంతర వివాహం చేసుకున్న రహమాన్

గర్ల్ ఫ్రెండ్‌ను బయటి వ్యక్తికి తెలియకుండా పదేళ్ల పాటు ఒకే గదిలో దాచిపెట్టాడా వ్యక్తి. అలించువట్టిల్ రహమాన్ అనే కేరళ వ్యక్తి వార్త వైరల్ అయింది.

Special Marriage: పదేళ్లుగా ఇంట్లో దాచి పెట్టి ఎట్టకేలకు మతాంతర వివాహం చేసుకున్న రహమాన్

Special Marriage

Updated On : September 16, 2021 / 9:17 PM IST

Special Marriage: గర్ల్ ఫ్రెండ్‌ను బయటి వ్యక్తికి తెలియకుండా పదేళ్ల పాటు ఒకే గదిలో దాచిపెట్టాడా వ్యక్తి. అలించువట్టిల్ రహమాన్ అనే కేరళ వ్యక్తి వార్త వైరల్ అయింది. ఇన్ని సంవత్సరాలుగా దాచిన సీక్రెట్ ఇక లీగల్ అయిపోయింది. బుధవారం పలక్కాడ్ లోని నెమ్మర సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ జంట ఒకటైంది.

మ్యారేజ్ డాక్యుమెంట్లపై సంతకం పెట్టడానికి వచ్చిన సింపుల్ సల్వార్ ధరించిన సాజిత.. ఎటువంటి మతాచారానికి సంబంధించిన దుస్తులు ధరించకుండా వచ్చిన రహమాన్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకుని స్వీట్స్ పంచుకున్నారు. ఈ వివాహ వేడుకు సాజితా ఇంటి సభ్యులు రాగా రహమాన్ తరపు వారెవ్వరూ రాకపోవడం గమనార్హం.

 

Read Also: Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ పరిసరాల్లో ఆదిమానవుల ఆన‌వాళ్లు

ఇప్పటి నుంచి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాం అని చెప్తున్నాడు రహమాన్. స్నేహితులు, బంధువులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కే బాబు ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ జంటకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించి ఇల్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని తెలిపారు.