కన్నీళ్లు తెప్పించే ఘటన : కరోనా సోకిందని తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేదు

కరోనా ఎంతో మంది జీవితాలను దూరం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఈ మహమ్మారితో వేలాది మంది మృత్యువాత పడుతున్నాయి. ఎన్నో హృదయ విదాకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్రిని చూడాలని ఎంతో తపనతో విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని మధ్యలోనే ఆపేశారు అధికారులు. ఎందుకంటే..అతని శరీరంలో కరోరా వైరస్ లక్షణాలు ఉన్నాయని. అంతలోనే తండ్రి చనిపోయాడు. చివరకు వీడియో కాల్‌లో కన్నీళ్లు దిగమింగుకుంటూ..తండ్రి చివరి చూపును చూశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కేరళ రాష్ట్రానికి చెందిన లినో అబెల్ ఖతర్‌లో దోహాలో పనిచేస్తున్నాడు. ఇటీవలే తండ్రికి గుండెపోటు వచ్చిందని సమాచారం అందింది. 2020, మార్చి 08వ తేదీన హుటాహుటిన బయలుదేరి ఇండియాకు వచ్చాడు. కానీ అప్పటికే కరోనా విలయతాండవం చేస్తోంది. ఎయిర్ పోర్టులో దిగగానే సిబ్బంది స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ విషయం పక్కకు పెట్టి…తన తండ్రిని చూడాలని కొట్టాయంలోని ఆస్పత్రికి చేరుకున్నాడు. కానీ అప్పడు అనుకున్నాడు. తనకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో..ఈ వైరస్ ఇతరులకు సోకుతుందని భావించి..ఓ వైద్యుడిని సంప్రదించాడు. అక్కడ కూడా వైరస్ లక్షణాలున్నట్లు నిర్ధారణ కావడంతో..ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు.
తరువాతి రోజు అంటే..మార్చి 09వ తేదీన అతని తండ్రి మరణించాడు. సమాచారం తెలుసుకున్న అబెల్ కన్నీరుమున్నీరుగా రోదించాడు. చివరి చూపు చూడాలని అనుకున్నాడు. అయితే..బయటకు వెళితే…వ్యాధి సోకుతుందని భావించాడు. తండ్రి చివరి చూపు చూడలేకపోయాననే బాధ..కుమిలికుమిలిపోయాడు. చివరకు ఆసుపత్రి సిబ్బంది ఇతని పరిస్థితి గమనించి..చలించిపోయారు. తండ్రి అంత్యక్రియలను చూపించాలని నిర్ణయించారు. వీడియో కాల్ ద్వారా..చివరి కర్మను అబెల్ చూడగలిగాడు.
ఇదంతా అబెల్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘తాను కావాలని అనుకుంటే..తండ్రి చూడగలిగేవాడినని, కానీ అలా చేయాలని అనుకోలేదు. ఎందుకంటే..తనకు ప్రాణాంతకమైన వైరస్ వచ్చింది..ఇతరులకు సోకే ప్రమాదం ఉంది..అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ ఇది వైరల్‌గా మారిపోయింది. అబెల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయం సీఎంకు తెలియచేసింది. అతని గుండె ధైర్యం, సమాజం పట్ల ఉన్న నిబద్ధత చూసి..మెచ్చుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి పూర్తిగా అబెల్ కోలుకున్నాడని వైద్యులు నిర్ధారించారు. తండ్రి చివరి చూపు దక్కనందుకు బాధ పడాలో..వైరస్‌ని జయించింనందుకు సంతోష పడాలో అబెల్‌కు అర్థం కావడం లేదని తెలిపాడు.
Read More : జగన్ వెంటాడుతున్న ‘విచక్షణాధికారం’